ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఢిల్లీ విమానాశ్రయంలో కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్వాగతించేందుకు వచ్చిన అభిమానులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. రెజ్లింగ్ లో వినేశ్ ఫైనల్ కు చేరినా అధిక బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే, వినేశ్ పతకం గెలవకపోయినా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. పతకం గెలిచిన క్రీడాకారుడికన్నా ఎక్కువగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి వినేశ్ బయటకు రాగానే బ్యాండ్ మేళంతో, పూలమాలలతో తోటి రెజ్లర్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. అది చూసి వినేశ్ కన్నీటిని ఆపుకోవడానికి విఫలయత్నం చేశారు. విమానాశ్రయం బయట కారులో వినేశ్ ను ఊరేగింపుగా తీసుకెళుతుండగా కంటతడి పెట్టారు. దీంతో పక్కనే ఉన్న తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా వినేశ్ ను ఓదార్చారు. కాగా, ఒలింపిక్స్ లో సెమి ఫైనల్ మ్యాచ్ లో వినేశ్ విజయం సాధించినా 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై వేటు పడింది. సెమీస్ విజయంతో రజతం ఖాయమైనా అధిక బరువు వల్ల పతకం దక్కలేదు. దీనిపై వినేశ్ ఫోగాట్ చేసిన అప్పీలును కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్లాండ్లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 150953