వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది.. ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు.. రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లెస్సీ స్థాయి నుంచి ఓనర్ కి మారింది.. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారు.. అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు.. ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే… షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్.. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే.. అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు అయింది.. అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారు..
ycp
గుంటూరు జిల్లా పొన్నూరులో సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందని, అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని చెప్పి హుకుం జారీ చేసిందని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పరిమిషన్లు తీసుకోవాలని విమర్శించారు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మీద, ఇసుక మీద చాలా దోచుకుంటున్నారన్నారు. నందిగామలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని దానికి వైసిపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నూరు నియోజకవర్గం లో 8,000 పెన్షన్లు తీసేసారన్నారు. కొత్తగా ఇచ్చిన పెన్షన్లు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు ఇక్కడ మన ఎమ్మెల్యే దోచుకుంటాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఎలా కబ్జా చేశాడో, మన పొన్నూరు ఎమ్మెల్యే గుళ్లను అలా కబ్జా చేశాడన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఏ పోస్టింగ్ కి రావాలన్న కప్పం కట్టాల్సిందే అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదాయం నెలకు 20 లక్షలన్నారు. 5లక్షల నుంచి 6 లక్షలు రేషన్ మాఫియా నుండి వసూలు చేస్తున్నాడన్నారు. బస్సు యాత్రకు వచ్చే నాయకులకు, మంత్రులకు సిగ్గుండాలన్నారు. సీఎం ఆఫీస్ ఐడి కార్డులు పెట్టుకొని గ్రావెల్ అమ్ముకొని ఈ ప్రభుత్వం 500 కోట్లు దోపిడీ చేశారన్నారు. బస్సు యాత్రకు డ్వాక్రా, వాలంటీర్నీ తరలించాలని అధికారులను బెదిరిస్తున్నారని విమర్శించారు పొన్నూరు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి మీద సమాధానం చెప్పి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ధూళిపాళ్ల ముగించారు.
Read Also..
ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు బీసీలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై, నెల్లూరు జిల్లా టిడిపి బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. వైసిపి పరిపాలనలో ఎక్కువగా నష్టపోయింది బీసీ లేనని, వారంతా ఐకమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సత్తా ఏమిటో చూపాలని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. దానికి సంబంధించి బీసీలను సమాయత్తం చేసేందుకు, కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలంతా సమావేశమయ్యారు. మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీనవర్గాలపై అధిక సంఖ్యలో దాడులు జరిగాయని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. బీసీ లను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని, సామాజిక బస్సుయాత్ర పేరుతో మరో నాటకం మొదలుపెట్టారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నష్టపోని కుటుంబమే లేదని, రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఐకమత్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని నాగేశ్వరరావు కోరారు. కందుకూరు నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మాలకొండ దేవస్థానం చైర్మన్ పదవుల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తూ బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలు హాజరవుతారని నాగేశ్వరరావు తెలిపారు.
ఏమీ చేయనోడే ఎగిరెగిరి పడుతుంటే అన్నీ చేసిన నేనేందుకు చెప్పుకోకూడదు అంటూ మాజీ మంత్రి అమరనాథ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. పలమనేరు కొత్తపేట సచివాలయ పరిధిలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మకండని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, గత ప్రభుత్వంలో ఇవన్నీ ఎందుకు చేయలేదో ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రశ్నించాలన్నారు. ఈ నిధులంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో డబ్బులు కట్టించుకుని పేద ప్రజలను మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానిదైతే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. సంక్షేమ పాలన కావాలంటే మరోసారి తనకు ఓటువేసి గెలిపించాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, అన్నురు పంచాయతీ, మిట్ట హరిజనవాడ లో ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణస్వామి పంచాయతీలో వైసిపి కార్యకర్తలు అభిమానులు భారీ షాక్ ఇచ్చారు వైయస్సార్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ తమను పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు పై ఉన్న అభిమానంతో డాక్టర్ థామస్ ను గెలిపించాలని ధ్యేయంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, ప్రతి ఇంటికి స్వీట్ బాక్స్ పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ…. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం డాక్టర్ థామస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు ఆరు మండలాల నుంచి తెదేపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా వైసీపీ నాయకులు, వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాశ్ జన్మదిన వేడుకలు అయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు… వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ లు మరియు అభిమానులు వేడుకల్లో పాల్గొని జయ ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ.. ” నా శ్రేయస్సు కోరుకునే ప్రధమ వ్యక్తుల్లో జయప్రకాశ్ ఒకడు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్ని నా శ్రేయస్సు కోసమే అని కొనియాడారు “…. జయప్రకాష్ మాట్లాడుతూ ” పుట్టినరోజులు చేసుకోవడం తన అభిమతం కాదని, ఈ నెపంతో పదిమందికి సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే పుట్టినరోజు నిర్వహించుకుంటానని తెలియజేశారు… ఈ సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు…
రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు అంతా బోగస్ అని టిడిపి ఏలూరు ఇంచార్జ్ బడేటి చంటి విమర్శించారు ఏలూరు పవర్ పేటలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ఏలూరులో జగనన్న ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టర్ లబ్ధిదారుల వద్ద నుండి కోట్లాది రూపాయలు దండుకొని పరారయ్యడని ఆయన ఆరోపించారు..తన స్వార్థం తప్ప ప్రజలకు మంచి చేసే అలవాటు లేని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మరోసారి ఎన్నికల ముందు తన విన్యాసాలు చూపుతున్నారని, అయితే ఆయన మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు లేరని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మైనారిటీలను సీఎం జగన్ నాలుగన్నరేళ్లుగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు. కాకినాడ బిజెపి కార్యాలయం జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో దుల్హన్ పథకం ద్వారా రూ.50వేలు ఇచ్చేవారన్నారు. ఎన్నికల్లో దుల్హన్ పథకంలో రూ.లక్ష అందిస్తానని చెప్పిన జగన్ నాలుగున్నరేళ్లుగా సవాలక్ష నిబంధన లతో దుల్హన్ పథకం ఏ ఒక్కరికి అందకుండా చేశాడన్నారు. గత ప్రభుత్వం విదేశి విద్యకు రూ.10లక్షలు ఇస్తే, తాను రూ.15లక్షలు చేస్తానని చెప్పి జగన్ విద్యా ర్థులను మోసం చేశాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటిలో కేంద్రం నిధులే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తుందన్నారు. గృహనిర్మాణానికి సంబంధించి బోర్డులలో కూడా ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అధికారులను బాధ్యులను చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బిజెపి మేధావుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రాష్ట్ర ముత్తానవీవ్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోక్కిలిగడ్డ గంగరాజు, డివి సూర్యనారాయణ రాజు, కవి కొండల భీమ శేఖర్, ధనరాజు, గంగాధర్, రంబాల వెంకటేశ్వరావు, చోడిశెట్టి రమేష్ బాబు , చిట్టీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో వైసీపీ నేతలు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అధికారులకు చింతమనేని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించలేదంటూ ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. గత అర్ధరాత్రి వేళ పోలవరం కుడి కాలువ వద్ద పలు వాహనాలను పట్టుకున్నారు. చింతమనేని 10 లారీలను, 2 జేసీబీలను, 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. తాను పట్టుకున్న వాహనాలతో సహా పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు కదలబోనని చింతమనేని నిరసనకు దిగారు. గత అర్ధరాత్రి నుంచి ఆయన పోలీస్ స్టేషన్ వద్దే నిరసన తెలుపుతున్నారు.




Total views : 141483