వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందని, ఓటమి భయంతో వారు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తాజాగా చంద్రగిరి మండలం భీమవరంలో మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. మునిరత్నం నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మునిరత్నం నాయుడు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేశ్ భరోసానిచ్చారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మునిరత్నం నాయుడుపై దాడి ఘటనను ఖండించారు. టీడీపీ నేత మునిరత్నం నాయుడుపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడికి దిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా టీడీపీ వెనుకడుగు వేయదన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. మునిరత్నం నాయుడుపై దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.
ycp
చంద్రగిరి మండలం, భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడు పై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడి చేశారు. గ్రామంలో జరిగిన ఓ కుటుంబ గొడవల కారణంగా మధ్యవర్తిగా పోలీస్ స్టేషన్ కు మునిరత్నం నాయుడు వెళ్లారు. మద్దిస్తం తెగకపోవడంతో వెనుదిరిగిన మునిరత్నం నాయుడు దింపుడు కళ్లెం దగ్గర వైసీపీ మండలం పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మట్టిరెడ్డి నవీన్ రెడ్డి వారి అనుచరలతో కలిసి దాడి చేశారు. మద్యం, గంజాయి మత్తులో బండరాళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారంటు బాధితుడు మునిరత్నం నాయుడు తెలియజేశారు. దాడి అనంతరం మునిరత్నం నాయుడు దగ్గర బంగారం కడియం, రూ.10 వేలు నగదు దోపిడి చేశారు.. స్థానికులు తీవ్రంగా గాయపడిన మునిరత్నం నాయుడును ఏరియా ఆసుపత్రికి తరలించారు.. సమాచారం తెలుసుకుని టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని హాస్పిటల్ కు చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు రుయా నుంచి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కు తరలించారు.
సీతారామపురం బిట్ -1 సచివాలయం పరిధిలో గురువారం ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనపై సీతారామపురం గ్రామ ప్రజలు వ్యతిరేక రాగం అందుకున్నారు. ప్రజలు అడుగడుగునా తమ సమస్యలను చెబుతూ నిలదీయడంతో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సందర్భంలో నాయకులు, ప్రజల మధ్య చిచ్చు రసాభాస జరిగింది. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగింది. సీతారామపురంలోని రాజు గారి వీధి, వాల్మీకి కాలనీ, పడమటి వీధి లకు చెందిన మహిళలు అత్యధిక సంఖ్యలో తమ సమస్యలను తెలిపేందుకు రాజగోపాల్ రెడ్డి వద్దకు రాగా ఆయన చుట్టూ ఉన్న నాయకులు నిలువరించడంతో వివాదం చెలరేగింది. రాజగోపాల్ రెడ్డి ప్రజల సమస్యలు వినకుండానే గడపగడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. సీతారామపురంలో గడపగడప కార్యక్రమం మొదలైన ఆదిలోనే మేకపాటి రాజగోపాల్ రెడ్డి పై వ్యతిరేకత రావడంతో తీవ్ర అసహనంతో తమ అనుకూలమైన కుటుంబాల వరకు వెళ్లి ఇతర సమస్యలను పట్టించుకోకుండా కార్యక్రమాన్ని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ గూడూరులో మీడియా సమావేశం. రెండు తెలుగు రాస్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయి. బి ఆర్ ఎస్ చేస్తున్నాదంతా అక్రమాలే అన్యాయలే ఆంధ్రపరదేశ్ లో వైసీపీ కి బీజేపీ కి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం. బీజేపీ కి వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి ఉండడకూడదనేది మోడీ తత్వం బీజేపీ ని వ్యతిరేకించిన వారిపై సిబిఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు. కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ తెరాస బీజేపీ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ బీజేపీ తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ తెరాస బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం హమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారు. మోడీ అమిత్ షా అండతోనే జగన్ ఇన్ని కేసులు ఉన్న బయట తిగితున్నాడు. విభజన చట్టాల్లోని హామీలు అమలు చేయకుండా చేస్తుండేది. బీజేపీ ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేదే బీజేపీ సిద్ధాంతం. టి ఆర్ ఎస్ ఇపుడు బి ఆర్ ఎస్ గా ఉంది ఎన్నికల తరువాత వి ఆర్ ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ )గా అవుతుంది. దేశంలో ఇండియా కూటమి రోజురోజుకి బలపడుతోంది. బీజేపీ ఓడిపోతుందనే బయముతోనే దుర్మార్గలాక్కు పాల్పడుతుంది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న ఎవరైనా హత్యలు మానభంగాలు చేయవచ్చు అటువంటి వారి జొలికి ఏ అధికారి కూడా వెళ్ళరు.
Read Also..
Read Also..
అనంతపురం జిల్లా… రాయదుర్గం నియోజకవర్గం… రాష్ట్ర ప్రభుత్వం వైసిపి పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వ యంత్రాంగంతో తో నిర్వహించడం పై మండి పడ్డ మంత్రి కాలవ శ్రీనివాసులు. డి హిరేహాల్ మండలంలోని ఓబులాపురం గ్రామంలో మా కొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ మంత్రి కాలవకు బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. సచివాలయాన్ని సందర్శించి కొత్త పింఛన్ల నిర్లక్ష్యంపై అధికారులతో సమీక్షించారు. సచివాలయం ఎదుట తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి కాల్వ బయటాయించి మాకొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దాదాపు ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బుక్లెట్ లు ముద్రించి జగనే మళ్లీ రావాలి అనే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, ఎంపీడీవోలు, కలెక్టర్లను మొదలుకొని, అందర్నీ దీనిలో భాగస్వామ్యం చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతో వైసిపి పార్టీ పిచ్చి ప్రచారాం పై టిడిపి పార్టీ, రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని విమర్శించారు. టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత కార్యక్రమం, పార్టీ కార్యక్రమానికి గానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదని బదులిచ్చారు. జగన్ ఎందుకు రావాలంటూ రాయలసీమ భవిష్యత్తు ఎడారి అవుతున్నందుకా, మద్యం నిషేధం దశలవారీగా అమలు చేస్తామన్న జగన్ రెడ్డి మద్యం రేట్లు పెంచాడనినా, మద్యం విక్రయాలు పెంచాడనినా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశాడు. తప్ప నియంత్రణ ఎక్కడ జరిగిందని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాడు.
Read Also..
టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చేసిన పని అని లోకేష్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ లెటర్ పై టీడీపీ కూడా మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని టీడీపీ విమర్శించింది. ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్‌కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరువురు మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శల చేసుకోవడంతో ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఒక నొటోరియస్ క్రిమినల్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పురందేశ్వరి 9 ఏళ్లుగా పని చేయడంతో ఆమె ప్రజలకు తెలుసు విజయిసాయిరెడ్డి మాత్రం ఏ2గానే ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. అసలు విజయసాయిరెడ్డికి సంస్కారం లేదని ధ్వజమెత్తారు. పురందేశ్వరి బయటపెట్టిన వైసీసీ ప్రభుత్వ అవినీతిపై విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి వెళ్లనున్నారు. సీఎం జగన్ పలు వివాహ వేడుకల్లో పాల్గోనున్నారు. జగన్ ఆ తర్వాత పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం, శిల్పారామాన్ని ప్రారంభించనున్నారు. రాత్రికి ఇడుపులపాయ లో వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేసి రేపు ఉదయం 8.30కు ఇడుపులపాయలో ఆర్ కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించి రేపు మద్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
చంద్రబాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.. 2014 మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు 2024లో అమలు చేస్తారని ఎవరు నమ్ముతారు… 2019లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రాష్ట్రం అభివృద్ధి విషయానికొస్తే చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయంలో 17వ స్థానం లో ఏపి… జగన్మోహన్ రెడ్డి హయాంలో 9వ స్థానం లో.. చంద్రబాబు హయాంలో 34128 ఉద్యోగాలు.. జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు, రేగ్యూలర్ చేసిన వాటితో ఐదు లక్షల ఉద్యోగాలు… పరిశ్రమల విషయానికొస్తే రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా తేలిపిన ప్రకారం 22వ స్థానంలో వుంది… జగన్మోహన్ రెడ్డి హయాంలో 3వ స్థానం లో వుంది… 12వేల కోట్లతో 38059 పాఠశాలలు నాడు-నేడు అభివృద్ధి. 10వేల పాఠశాలలో డిజిటల్ బోర్డులు.. వందలాది ఆసుపత్రులు రూపురేఖలు మార్చడం జరిగింది. 40లక్షలకు పైగా తల్లులకు అమ్మఒడి. జిఎస్డిడిపి లో చంద్రబాబు హయాంలో 22 వ స్థానం, జగన్ హయాంలో 2 స్థానం. కరోనా ను ధైర్యంగా ఏదుర్కోని ప్రజలకు అండగా నిలబడిన రాష్ట్రాల్లో ఎపి మొదటి స్థానం లో నిలబడింది… స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2019 వరకు 5 ఒడరేవులు, 5 హర్బర్ లు, 11 మెడికల్ కాలేజీలు మాత్రమే వున్నాయి… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఒడరేవులు, 10 హర్బర్ లు, 3 ఎయిర్‌పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు కోత్తగా ఏర్పాటు చేయడం జరుగుతోంది.





Total views : 141264