Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana అమిత్ షా తెలంగాణలో పర్యటన

అమిత్ షా తెలంగాణలో పర్యటన

by Satya
Amit Shah


తెలంగాణలో అమిత్ షా టూర్ షెడ్యూల్:

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల మార్చి 4వ తేదీన అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీ- బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 24వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల స్టేట్ టూర్ క్యాన్సిల్ అయ్యింది.

చేవెళ్ల కార్యకర్తలతో సమావేశమైన మంత్రి శ్రీధర్ బాబు…

దీంతో మార్చి 4న ఆయన తెలంగాణకు రానున్నారు. కాగా, తెలంగాణ(Telangana)లో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈ నెల 16వ తేదీన బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఈ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కోసం బీజేపీ రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది.

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

ఐదు క్లస్టర్లలో యాత్ర మొదలుపెట్టి చివరగా హైదరాబాద్‌లో ముగించనున్నారు. ఈ యాత్రలో స్టేట్ బీజేపీ అగ్రనేతలతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయసంకల్ప యాత్ర మార్చి 4వ తేదీన ముగియనుంది. యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర క్లోజింగ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో రేపు …
రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం నిన్న …
జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.
జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా …

Advertisements

You may also like

Our Visitor

036124
Total views : 180895

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.