Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Health ఇవి వాడినట్లు అయితే కళ్ళు జాగ్రత్త.. ఈ ఆహారం మీ కోసమే

ఇవి వాడినట్లు అయితే కళ్ళు జాగ్రత్త.. ఈ ఆహారం మీ కోసమే

by Satya
Smartphone, computers

చాలామంది రోజంతా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది. కంటి సమస్య ఎక్కువైన తర్వాత ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం. ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం. చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. బత్తాయి, నారింజ వంటి పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. మనం తీసుకునే ఆహారంలో టమాటాలను చేరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. టమాటాలలో మన కంటి చూపును కాపాడే లైకోపీన్ ఉంటుంది. ఈ ఆహారాలను కంటి చూపును మెరుగుపరచుకోవటం తీసుకోవటంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసేవారు గంటకో మారు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెయ్యటం మంచిది.కంటి ఆరోగ్యాన్ని బాదం పప్పు బాగా పెంచుతుంది. బాదం పప్పు నానబెట్టి నిత్యం రెండు పప్పులు తినటం కంటికి మేలు చేస్తుంది. గ్రుడ్లు, చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహరం. గ్రుడ్లలో జింక్, విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026338
Total views : 150254

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.