Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Technology ఇంటర్నెట్ యూజర్లకు భారీ షాక్..!

ఇంటర్నెట్ యూజర్లకు భారీ షాక్..!

by Satya
internet users

ఇంటర్నెట్ యూజర్లతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్ల మంది డేటా తస్కరణకు గురైందని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల రీసెర్చర్లు వెల్లడించినట్లు ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఇలా సైబర్ మోసగాళ్లు సేకరించిన డేటా అంతా ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే సెక్యూర్ పేజీలో ఉందని చెప్పారు. చైనా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డ్ ఇన్, ఎక్స్ డాట్ కామ్, టెలిగ్రామ్‌తోపాటు ట్విట్టర్, డ్రాప్ బాక్స్ వంటి వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజర్ల నుంచి ఈ డేటాను సైబర్ మోసగాళ్లు తస్కరించారని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల పరిశోధకులు తెలిపారు. ఈ డేటా బేస్‌ను ఒక డేటా బ్రోకర్ గానీ, ఒక సైబర్ ఫ్రాడ్‌స్టర్ గానీ కంపైల్ చేసి ఉంటారని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: