Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Main News డీసీసీబీ డైరెక్టర్ అరెస్ట్…

డీసీసీబీ డైరెక్టర్ అరెస్ట్…

by Prakash
BRS Party, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్

BRS Party :

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళ చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో గతంలో జరిగిన మట్టి త్రవ్వకాలపై BRS నాయకుడు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. శేఖర్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 447, 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు తో పాటు BRS కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన కు దిగారు. ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ ఇంటూరి శేఖర్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థి ఉపేందర్ రెడ్డి కి పని చేసిన వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం శాశ్వతం అనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని అధికారులకు ఇష్టం లేకపోయినా అరెస్ట్ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. టెర్రరిస్టులగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని
అధికార పార్టీ అడుగులకు మడుగులోత్తితే ఇబ్బంది పడేది అధికారులే అని ఆయన హెచ్చరించారు. ముందు గా నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని అధికారం శాశ్వతం అనే నాయకుల కు ప్రజలే బుద్ది చెబుతారని ఆయన అన్నారు.

Read Also…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

025452
Total views : 147295

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.