92
విశాఖపట్నంను ఐటీ క్యాపిటల్ గా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ ప్రభుత్వం సిటీని గంజాయి క్యాపిటల్ గా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ ప్రసంగించారు. నాడు చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని విశాఖకు తీసుకొస్తే.. ప్రస్తుతం జగన్ పాలనలో నగరంలో రోజుకో హత్య, కిడ్నాప్, కుంభకోణం జరుగుతున్నాయని లోకేశ్ ఆరోపించారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారని జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.