Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయం..

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయం..

by Rama
Election Comission

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను హెచ్చరించింది. వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పార్టీలు వ్యవహరించరాదని… మతం, భాష, సామాజికవర్గం ప్రాతిపదికన ఓట్లు అడిగే ప్రయత్నం చేయవద్దని పార్టీలకు స్పష్టం చేసింది. ప్రచారం కోసం ప్రార్థనా మందిరాలను వాడుకోవద్దని పేర్కొంది. ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లను మోసగించేలా తప్పుడు ప్రకటనలు చేయరాదని ఈసీ వెల్లడించింది. అవాస్తవ ప్రకటనల జోలికి వెళ్లొద్దని, ముఖ్యంగా, సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. రాజకీయ ప్రత్యర్థులను దూషించే పోస్టులు, వారిని అవమానించే పోస్టులు పెట్టరాదని స్పష్టం చేసింది. ఇక, గతంలో నోటీసులు అందుకున్న ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఎన్నికల ప్రచారంలో విభజనవాదం, వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని… సమస్యలే అజెండాగా ఎన్నికల్లో ప్రచారం సాగించాలని, సుహృద్భావ వాతావరణంలో రాజకీయ చర్చలను ప్రోత్సహించాలని వివరించింది. ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: భూమిలేని పేదలకు సీఎం జగన్ గుడ్‌ న్యూస్


సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.
ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం …
నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ
నేపాల్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ …
అనకాపల్లి జిల్లాలో కీలక నిర్ణయం.
పర్యావరణ పరిరక్షణ, చారిత్రక సంపద రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: