Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..!

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..!

by Satya
Supreme Court issues important orders

ఎస్‌బీఐకి కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు(Supreme Court):

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds)కు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌ బ్యాంక్..ఎస్‌బీఐని ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్‌బీఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు అధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds)కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోర్టుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అంతేకాదు, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌ను ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఇది చదవండి: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్…


పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె …
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023155
Total views : 141238

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.