Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Political నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల…

నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల…

by Prakash
Election Notification

ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification) :

నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification)ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పదకొండు గంటల నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇచ్చారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేశారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
    భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం ‘సెమీకాన్‌ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
  • ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్రకు ప్రధాని మోదీ నివాళి.
    ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. శరత్‌చంద్ర సాహిత్య వైభవాన్ని, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని…
  • ఉద్యోగులకు కేంద్రం కీలక నిర్ణయం.
    ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో EPFO వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ఆమోదం లభించింది. 2014 తర్వాత తొలిసారిగా ఈ పరిమితిని…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: