బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ డీజీపీకి రాజాసింగ్ లేఖ రాశారు. వివిధ నెంబర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. తనను చంపేస్తామంటూ కాల్స్ చేస్తున్నారని చెప్పారు. హిందూ ధర్మం కోసం పనిచేయడం మానుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గత సీఎం కూడా బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపించలేదని…. ప్రస్తుత సీఎం కూడా బెదిరింపు కాల్స్‌ను పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో తమ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని బెదిరిస్తున్నారని చెప్పారు. బెదిరింపు కాల్స్ చేసినవారికి సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ వస్తే విచారణ సీరియస్‌గా జరుగుతుందన్న ఉద్ధేశంతో నెంబర్ ఇచ్చాన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
- రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…