78
అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణను గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని రంగంలోకి దించుతున్నామని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని సీఎం స్పష్టం చేశారు.





Total views : 141007