Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh సింగపూర్‌లో ఏపీ మంత్రుల పర్యటన..

సింగపూర్‌లో ఏపీ మంత్రుల పర్యటన..

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఏపీ మంత్రుల బృందం సింగపూర్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రుల బృందం కీలక సమావేశాన్ని నిర్వహించింది. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్‌తో ఏపీ మంత్రుల బృందం భేటీ అయ్యింది. భారత హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. భారత్ – సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలను, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విస్తరణకు ఉన్న అవకాశాలను మంత్రులు వివరించారు. మౌలిక వసతుల కల్పన, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించాయి. కాగా, మంత్రుల బృందం ఏప్రిల్ 27 వరకు మొత్తం 7 రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మరిన్ని పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisements

You may also like

Our Visitor

023128
Total views : 141089

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.