ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండల పరిధిలోని అటవీ, రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి, కంకర తవ్వకాలను చేపడుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ తంతు ప్రతిరోజూ కొనసాగుతోంది. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి దళారులు అక్రమంగా గండికొడుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటంపై పలువురు మండిపడుతున్నారు. ఇండ్లు కట్టుకునే వారికి మట్టి, కంకరతో అవసరం ఉంటుంది. దీంతో అధికారులతో కుమ్మక్కైన దళారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కూడా దళారులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి వారికి సహకరిస్తున్నారు. పుట్రెల గ్రామంలో కోటిపల్లి నుండి పక్క మండలాలకు టిప్పర్ల, ట్రాక్టర్లు ద్వారా మట్టి, కంకర తరలిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
నరసాపురం గ్రామంలోని అటవీ ప్రాంతం నుంచి మట్టిని తరలిస్తున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవటంతో వారి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ భూముల్లో లెవెల్ ట్రాక్టర్ పెడితేనే అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకుంటారు.. అలాంటిది ఇప్పుడు ఏకంగా తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోవట్లేదు. దీంతో వారికి ఎంత మేర ముట్టిందో దీనిబట్టే అర్థమవుతోంది. దీనిపై అధికారులను ప్రశ్నించే వారి పేర్లు, ఫోన్ నెంబర్లు సదరు దళారులకు ఇస్తూండటంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళారుల దందాకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141556