ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబరు 3న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు సిఎం చంద్రబాబు. ఈ మేరకు ఆ పథకాన్ని ఇవాల్టి నుంచి అమలు చేయనున్నారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రిపై భేటీయై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
APSRTC
ఏపీలో టెస్త్, ఇంటర్ విద్యార్థులకు ఉచిత బస్సు:
ఏపీలో టెన్త్, ఇంటర్, ఒకేషనల్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు జరిగినన్నీ రోజులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సూచించారు.
వైసీపీకి రఘురామకృష్ణంరాజు రాజీనామా..!
పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. టెన్త్ పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక ఒకేషనల్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెల 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సును నిలుపుదల చేశారు. గురువారం రోజు రాత్రి ఎనిమిది గంటల 35 నిమిషాల సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి విజయవాడకు బయలుదేరిన విజయవాడ డిపోకు చెందిన AP 10 Z 0737 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. అకస్మాత్తుగా దట్టమైన అడవి ప్రాంతంలో గల శిఖరం చెక్‌పోస్ట్ వద్ద బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో చలి గాలులతో భక్తులు, చంటి పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయంలో 9:00 దాటితే శిఖరం చెక్‌పోస్ట్ నుంచి ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతించరని అనుమతించాల్సి వస్తే స్థానిక శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ అధికారి వారి అనుమతి అవసరమని చెక్‌పోస్ట్ సిబ్బంది తెలిపారు. స్థానిక మీడియా ఘటన స్థలానికి చేరుకోవడంతో అప్పటివరకు బస్సును అనుమతించని ఫారెస్ట్ సిబ్బంది చివరకు బస్సు వెళ్లేందుకు 10:10 నిముషాలకు శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చినట్లుగా వెల్లడించి అక్కడ నుంచి బస్సు విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు.
విశాఖలో కలాసీల సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్న వైనం. ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకు తరలింపు. ప్రైవేట్ వాహనంపై యదేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు. ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఇలా అయితే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకొస్తాదని ఉద్యోగులు గుసగుసలు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోని విశాఖ ఆర్టీసీ ఉన్నతాధికారులు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ లో పని చేస్తున్న డ్రైవర్ల పై రోజు రోజుకూ దాడులు జరుగుతూనే వున్నాయి. సమాజానికి మర్గానిర్దేసుకులుగా ఉపాధ్యాయులు ఉన్నారు. అటువంటిది ఉపాధ్యాయుడు బస్సు అపలేదన్న అక్రోసంతో డ్రైవర్ ,కండక్టర్ పై చెప్పలేని విదంగా పదజాలంతో దుర్బాశాలాడి దాడి చేసిన ఘటన కడప జిల్లా చక్రాయపేట మండలం లో చోటు చేసుకోంది …వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రాయచోటి డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్ నరసింహులు తెలిపిన వివరాల మేరకు… నిన్న మధ్యాహ్నం రాయచోటి నుంచి వేంపల్లి కి సర్వీసు వెళ్ళడం జరిగింది. నాగులగుట్ట పల్లి దగ్గర బస్సు ఎక్కేందుకు బస్సు ఆపడం జరిగింది. అప్పటికే బస్సు లోపల ప్రయాణికులు విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో ఆపేందుకు వీలు లేక పోవడం తో ఈ బస్సు వెనకాలా బస్సు వస్తుందని చెప్పి వెళ్ళిపోవడం జరిగిందన్నారు. అక్కడే ఉన్నటువంటి ఓ ఉపాధ్యాయుడు కారులో వచ్చి చక్రాయపేట సమీపంలో కారును బస్సుకు అడ్డంగా పెట్టి బస్సు ఎందుకు నిలపలేదు అని డ్రైవర్ నరసింహులు, కండక్టర్ పై దుర్భాషలాడారు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పినప్పటికీ వారిని కూడా తిట్టడం మొదలు పెట్టారు. దీంతో చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు రాయచోటి.. వేంపల్లి అద్దె బస్సులు నిలిపివేశామని మాకు న్యాయం జరిగేంత వరకు సర్వీస్ లు పునరుద్దరించే ప్రసక్తే లేదని వారు తెలియజేశారు. దీంతో సమయానికి బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ పై దాడి చేసిన ఉపాధ్యాయుడు పై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఆర్టిసి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. బుట్టాయిగూడెం బస్ షెల్టర్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. జంగారెడ్డిగూడెం నుండి దొర మామిడి వెళుతున్న ఆర్టీసి బస్ బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. బస్సు అటువైపు కాకుండా మరోవైపు వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్పారు.





Total views : 152441