సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా మొదలయ్యింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ డాల్బీ ధియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగింది. వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటుడుగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటిగా డేవైన్ జో రాండాల్స్, బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ లో నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ కు అవార్డు దక్కింది. కార్డ్ జెఫర్ పన్ కు బెస్ట్ అడాఫ్టెడ్ స్ర్కీన్ ప్లే, జస్టిస్ట్ ట్రెట్, ఆర్ధర్ హరారీలకు బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే అవార్డు అందుకున్నారు. ఉత్తమ కాస్టూమ్ డిదైన్ వోలి వెడ్డింగ్ టన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్లుగా జెమ్స్ ప్రైస్, షానో హెత్ కు దక్కింది. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్ గా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంపికయ్యింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా హెయటే వన్ హోయటేమా, ఉత్తమ వీజువల్స్ ఎఫెక్ట్స్‌గా గాడ్జిల్లా మైనస్ వన్, ఓపెన్ హైమర్-ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ దక్కింది. దా లాస్ట్ రిపేర్ షాప్-ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఎంపికయ్యింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ 20 డేస్ ఇన్ మరియాపోల్, ఉత్తమ సినిమాటోగ్రఫి ఓపెన్ హైమర్ కు దక్కింది.
CVR Film News
‘వెయ్ దరువెయ్’(Vey Daruvey).. రెండున్నర గంటల పక్కా ఎంటర్టైనర్ – దర్శకుడు నవీన్ రెడ్డి
సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు…
*మాది కృష్ణాజిల్లా దగ్గర నూజివీడు. మా బంధువులు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అలా నాకు సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసిన తర్వాత సతీష్ వేగేశ్నగారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ‘వెయ్ దరువెయ్’ చిత్రంతో దర్శకుడిగా మారాను.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నాకు తెలిసిన వాళ్ల ద్వారా నిర్మాత దేవరాజ్ పోతూరుగారితో పరిచయం ఏర్పడింది. కథ వినగానే ఆయనకు నచ్చటంతో సినిమా చేయటానికి అంగీకరించారు. సినిమాను కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అంత త్వరగా పూర్తి చేయటానికి కారణం ప్రీ ప్రొడక్షన్‌పై ఎక్కువగా పని చేయటమే. మూడు నాలుగు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకోవటం వల్ల షూటింగ్ చాలా సులభంగా ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి చేశాం.
- దర్శకుడిగా ‘వెయ్ దరువెయ్’ తొలి చిత్రమే అయినప్పటికీ ఎలాంటి ప్రెషర్ ఫీల్ కాలేదు. అందుకు కారణం నిర్మాత దేవరాజ్‌గారు, హీరో సాయిరామ్ శంకర్ సహా ఎంటైర్ టీమ్ అందించిన సపోర్ట్ అనే చెప్పాలి. సాయిరామ్ శంకర్‌ను హీరోగా అనుకుని పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో కలిశాం. సాయిరామ్ శంకర్‌గారైతే నా కథలోని హీరో బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతారనిపించింది. అందుకనే ఆయన్ని అప్రోచ్ అయ్యాం.
- కామారెడ్డి ప్రాంతంలో ఉండే హీరోకి ఓ సమస్య వస్తుంది. దాని పరిష్కారానికి హీరో ఏం చేశాడు.. ఎందుకు హైదరాబాద్ వచ్చాడు.. సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడనేదే మా సినిమా మెయిన్ కథాంశం. సినిమా చిన్న సెంటిమెంట్‌తో ప్రారంభం అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కొన్ని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాం. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించాం. యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది.
- సినిమాలో ఎంటర్టైన్మెంట్ మెయిన్ హైలైట్. మేం అనుకున్న పాయింట్‌ను సీరియస్‌గానూ చెప్పొచ్చు. కానీ నేను ఎంటర్టైనింగ్గానే చెప్పాలనుకున్నాను. భీమ్స్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మంచి సీనియర్ ఆర్టిస్టులు నటించారు. హీరోయిన్స్ యషా శివకుమార్, హెబ్బా పటేల్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కథలో భాగంగా వారి పాత్రలు ట్రావెల్ అవుతాయి.
- ‘వెయ్ దరువెయ్’ దర్శకుడిగా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. సినిమా ఫస్ట్ కాపీ చూసి నిర్మాత గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రెండున్నర గంటల పక్కా ఎంటర్టైనర్.
- నెక్ట్స్ సినిమా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డిస్కషన్స్ జరుగుతున్నాయి.
మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడక్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
‘లైన్ మెన్’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్
‘లైన్ మెన్’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్
తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మెన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. మార్చి 15న ‘లైన్ మ్యాన్’ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శివ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్ లాంచ్ చేశారు. అనంతరం ఈ ఈవెంట్లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..
శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘లైన్ మెన్ పోస్టర్లు చూస్తేనే సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. మన మూలాల్లోకి వెళ్లి రాసుకునే కథలు, తీసే సినిమాలు ఆడియెన్స్‌కు ఎక్కువగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంటాయి. ఇలాంటి సినిమాను రాసిన, తీసిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీగా తీశారనిపిస్తుంది. అందుకే రియల్ లైన్ మెన్లను ఇక్కడకు పిలిచి సత్కరించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలి. ఇలాంటి కొత్త సినిమాలు ఆడితే.. మరి కొంత మంది ముందుకు వస్తారు. త్రిగుణ్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ తన చుట్టూ ఉండే వాళ్లని కంఫర్ట్‌గా ఉంచాలని ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి. త్రిగుణ్ కెరీర్లో పెద్ద హిట్‌గా నిలవాలి. మార్చి 15న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘తినే ప్రతీ మెతుకు మీద పేరు రాసి ఉంటుందని అంటారు.. ప్రతీ పాత్ర మీద కూడా చేసే వాడి పేరు రాసి ఉంటుంది. మన స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో చిన్న ఉడతలా సాయం చేస్తున్నాను. లేడీస్ లైన్ ఉమెన్‌గా రావడం చూసి.. ఈ సినిమాను చేయాలని అనుకున్నా. కథ సరిగ్గా ఆడలేదు.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో అన్నీ బూతులే. డబ్బులు బాగా వచ్చాయి. కారు, ఇళ్లు కొనుక్కుని సెటిట్ అయ్యా. కానీ లైన్ మెన్ లాంటి సినిమాలు తీసినప్పుడు రాత్రి పూట ప్రశాంతంగా పడుకుంటాం. ఇప్పుడు సినిమాలకు భాషా సరిహద్దుల్లేవు. లైన్ మెన్లు చేస్తున్న సేవలను ఎవ్వరూ గుర్తించడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా మొదటి సినిమాను నిర్మించారు. ఆయనలా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంటుంది. నా కోరిక తీర్చిన నా నిర్మాతలకు థాంక్స్. వంశీ అన్న నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. బి. జయశ్రీ గారు ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్. ఆమెకు పద్మ శ్రీ అవార్డు వచ్చింది. అలాంటి వారు మా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నేను వాళ్లకి తెలుగు నేర్పించాను. వాళ్లు నాకు కన్నడ నేర్పించారు. అలా మా సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో షూట్ చేశాం. మనం ఇప్పుడు ఫోన్, టీవీ వంటి వాటికి బానిసల్లా మారాం. ఓ గంట కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చాం. ఓ ఊర్లో పది రోజులు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథ. లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒకప్పుడు మా అమ్మ ఉండేది.. ఇప్పుడు లేరు.. సినిమా బిజీల్లో పడి ఎక్కువగా మాట్లాడేవాడ్ని కాదు. జీవితం చాలా చిన్నది.. చాలా విలువైనది. ఇలా ప్రతీది విలువైందే అని సందేశం ఇచ్చే చిత్రమిది. ఓపెనింగ్స్ తెప్పించేంత బలం, బలగం లేదు. కానీ మా కథే మా బలగం. ప్రతీ ఒక్కరూ మా సినిమాకు కనెక్ట్ అవుతారు. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సినిమా కంటెంట్ మారుతోంది. కథే హీరోగా మారింది. ఈ చిత్రం కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. పూర్తిగా పల్లెటూరిలోనే షూట్ చేశారు. త్రిగుణ్ ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
వర్దన్ పేట్ ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హీరోలను చూసి సినిమాలు చూస్తుండేవారు. కానీ ఇప్పుడు కథలే హీరోగా మారాయి.కొత్త వాళ్లు వస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. లైన్ మెన్ ట్రైలర్ చూశాను. లైన్ మెన్ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. వారి జీవితాన్ని తెరపై తీసుకొస్తున్న హీరో, దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
యతీష్ మాట్లాడుతూ.. ‘లైన్ మెన్ సినిమాను రాయడం, తీయడం ఓ సాహసం. రియల్ లైన్ మెన్లను చూడటం, వారు పని చేసే విధానాన్ని గమనించి ఈ చిత్రాన్ని రాసుకున్నారు. ఇలాంటి మంచి కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలు గ్లోబల్‌గా రీచ్ అవ్వాలనే మేం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని మేం ఎంకరేజ్ చేస్తుంటాం. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మానవ సంబంధాలను చూపించాం. మనిషి విలువ, మానవత్వం ఇలా అన్ని యాంగిల్స్‌లో చూపించాం. సినిమాలోని ఎమోషన్‌ను ఆడియెన్స్ ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఇలాంటి కంటెంట్ సినిమాలను ఇంకా నిర్మిస్తున్నాం. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.
వంశీ మాట్లాడుతూ.. ‘యతీష్, గణేష్ గార్లు ఈ సినిమాకు ప్రధానం. ఈ చిత్రానికి త్రిగుణ్ ప్రాణం పోశారు. లైన్ మెన్ జీవితంలో ఎన్ని ఇబ్బందులుంటాయి.. గ్రామాల్లో వారు జనాలతో ఎంత మమేకం అవుతారు.. అన్నది చాలా చక్కగా చూపించారు. అలాంటి లైన్ మెన్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మంచి సందేశాత్మక చిత్రంగా లైన్ మెన్ రాబోతోంది. మార్చి 15న రాబోతోన్న మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలి’ అని అన్నారు.
గణేష్ పాపన్న మాట్లాడుతూ.. ‘మేం లోకల్ కంటెంట్‌ను గ్లోబల్ ఆడియెన్స్‌కి తీసుకెళ్లాలని అనుకుంటాం. కమర్షియల్ కోసం సినిమాలు చేయం. సబ్జెక్ట్ బేస్డ్ సినిమాలు చేయాలని అనుకుంటాం. ఈ కథ విని త్రిగుణ్ ఈ సినిమాను చేస్తానని అన్నాడు. అయితే ఇది కన్నడలో తీయాలని అనుకున్నాం. కన్నడలోకి వస్తానని త్రిగుణ్ అన్నారు. అప్పుడే ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నాం. ఇది చాలా మంచి కంటెంట్. మంచి కథ ఉంటుంది. లైన్ మెన్ కథ మాత్రమే కాదు.. కరెంట్ పోతే గ్రామాల్లో ఏం జరుగుతుందని చూపించాం. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.
వి రఘు శెట్టి మాట్లాడుతూ.. ‘ మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని చూపించే చిత్రిమిది. ఇండియాలోని ఏదో ఒక ప్రాంతంలో జరిగినట్టు అనిపించదు. ప్రతీ ప్రాంతంలో జరిగిన కథలానే ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎమోషన్స్‌ను ఇంటికి తీసుకెళ్తారు. సినిమాను చూస్తే కంట్లోంచి నీరు వస్తుంది. సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారని మాత్రం చెప్పగలను. ఈ కథను పెద్ద పెద్ద హీరోలకు చెప్పాను. హీరోయిన్ ఉందా? ఫైట్స్ ఉన్నాయా? అని అడిగారు. కానీ త్రిగుణ్ మాత్రం కథ గురించే అడిగారు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఇది ఒక ఊరు కథ. అందులో అందరూ హీరో, హీరోయిన్లే. ఇలాంటి సినిమాను ఒప్పుకోవాలంటే నిర్మాతలకు గట్స్ కావాలి. మార్చి 15న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి’ అని అన్నారు.
మైక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం డిఫరెంట్స్ కాన్సెప్ట్‌లతో చిత్రాలు వస్తున్నాయి. లైన్ మైన్ కూడా కొత్త పాయింట్‌తో రాబోతోంది. ట్రైలర్ చూస్తుంటే త్రిగుణ్ అద్భుతంగా నటించేశాడనిపిస్తోంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రాజీవ్ చిత్రా మాట్లాడుతూ.. ‘లైన్ మైన్ అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పోస్టర్లు, టీజర్, ట్రైలర్ పాటలు అన్నీ బాగున్నాయి. త్రిగుణ్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో చిత్రీకరించారు. మార్చి 15న సినిమా రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
నటీనటులు: త్రిగుణ్, కాజల్ కుందెర్, బి.జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ, మైకో నాగరాజ్, చేతన్ గంధర్వ, దిలీప్ కుమార్, సందీప్ కెంపగౌడ, శ్రీదత్త, సమర్థ్ నర్సింహులు, సుహైల్ రసూల్, గౌరవ్ శెట్టి తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం – వి రఘు శాస్త్రి
నిర్మాణం – పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్
సహ నిర్మాతలు – ప్రచూర పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘు శాస్త్రి, భళా స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – గణేష్ పాపన్న
సినిమాటోగ్రపీ – శాంతి సాగర్ హెచ్ జి
ఎడిటర్ – రఘునాథ ఎల్
మ్యూజిక్ – కాద్రి మణికాంత్
ఆర్ట్ – సూర్య గౌడ
పి.ఆర్.ఒ – వంశీ కాకా, హరీష్ అరసు
పబ్లిసిటీ డిజైన్స్ – రాజ్సో క్రియేటివ్స్
లేబుల్ – సారిగమ ఇండియా లిమిటెడ్, ఏ ఆర్ పి ఎస్ జి గ్రూప్ కంపెనీ
మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్ సి ట్రెండ్ సెట్టర్స్ క్లాతింగ్ తో ఫస్ట్ బ్రాండింగ్ చేయడం హ్యాపీగా ఉంది – యంగ్ హీరో ఆకాష్ పూరి
యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేయడం హ్యాపీగా ఉందంటున్నారు ఆకాష్ పూరి. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంఛ్ కార్యక్రమంలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్ తో కలిసి ఆకాష్ పూరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
ఆకాష్ పూరి మాట్లాడుతూ – ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని రమేష్, రోమన్ నన్ను సంప్రదించారు. నేను ఈ బ్రాండింగ్ కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్ లో బయటకు వెళ్తుంటాను. వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు. అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకొచ్చాను. నేను చేస్తున్న ఫస్ట్ బ్రాండింగ్ ఇదే కావడం హ్యాపీగా ఉంది. నిన్న ఈ బ్రాండ్ ను లాంఛ్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చాం. ఆ ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాకుండా మరికొన్ని బ్రాండింగ్స్ కు కూడా అంబాసిడర్ గా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా చోర్ బజార్ అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఓ లవ్ స్టోరీ, మరో యాక్షన్ మూవీ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. నేను ఈ సారి చేసే సినిమా కిడ్స్, ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చేలా చూసుకుంటాను. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అనే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ వంటి క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్ లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ వంటి మూవీస్ చూసినప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించాలి అనే కోరిక కలుగుతుంటుంది. నాన్న పూరి డైరెక్షన్ లో రామ్ గారు నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చాలా బాగా వస్తోంది. ఈ మధ్యే టీజర్ రఫ్ కట్ చూశాను. రామ్ గారి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది. ప్రభాస్ గారిని కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు అన్నారు.
ఇది చదవండి : ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ చేతుల మీదుగా ‘రవికుల రఘురామ’ మూవీ సాంగ్ “ప్రాణాలే” విడుదల !!!
ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఓనర్ రమేష్ మాట్లాడుతూ – ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ను మొదట ఆన్ లైన్ బ్రాండింగ్ గా మొదలుపెట్టాం. ఆన్ లైన్ లో క్లోతింగ్ విషయంలో చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. మనం జెన్యూన్ గా కస్టమర్స్ కు క్లోత్స్ అందించాలని ఆన్ లైన్ లో అమ్మకాలు ప్రారంభించాం. క్యాజువల్స్, ఫార్మల్స్, ఇంపోర్టెడ్, ఫంకీ, మెన్స్ యాక్ససరీస్ ఇలా… మెన్స్ క్లోతింగ్ కు వన్ స్టాప్ లా ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఆర్ సీ కి వస్తే ఏ ప్రాడక్ట్ అయినా దొరుకుతుంది అనే నమ్మకాన్ని ఇస్తున్నాం. మా బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎవరు బాగుంటారని అనుకున్నప్పుడు ఆకాష్ అయితే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయి మా బ్రాండ్ గురించి చెప్పాం. ఆకాష్ గారు మా బ్రాండ్ కు ప్రచార కర్తగా ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం అన్నారు.
ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఓనర్ రూమన్ మాట్లాడుతూ – మా ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ను 2022 లో స్టార్ట్ చేశాం. రెండేళ్లలోనే ఒక మంచి పొజిషన్ లోకి రావడం సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ మేము స్థాపించడం వెనక ఉన్న లక్ష్యం ఒక్కటే. మెన్స్ వేర్ కు వన్ స్టాప్ సొల్యూషన్ లా ఉండాలని అనుకున్నాం. మెన్స్ వేర్ లో మార్కెట్ లో ఉన్న స్పేస్ ను క్యాప్షర్ చేయాలని అనుకుంటున్నాం. మేము విజయవాడలో స్టోర్ పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి కొనుక్కునేవాళ్లు. కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టబోతున్నాం. మా బ్రాండ్ కు ప్రచాకర్తగా చేసేందుకు ఒప్పుకున్న ఆకాష్ అన్నకు థ్యాంక్స్ అన్నారు.
మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
“ది గోట్ లైఫ్” (The Goat Life) :
ఇటీవల కాలంలో సినీ ప్రియుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (The Goat Life). ఈ సినిమా ఈ నెల 28 న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇవాళ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
అసాధారణ మేకింగ్ తో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “ది గోట్ లైఫ్” ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేలా ట్రైలర్ కట్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వివిధ గెటప్స్ లో కనిపించిన తీరు, అద్భుతమైన విజువల్ క్యాప్షర్, విశాలమైన ఎడారి లొకేషన్స్, హీరో క్యారెక్టర్ అయిన నజీబ్ జీవితంలోని భావోద్వేగాలను హార్ట్ టచింగ్ గా ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా
దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ – నా దృష్టిలో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) లాంటి గొప్ప సర్వైవల్ అడ్వెంచర్ సినిమా ఇప్పటివరకు వెండితెరపై రాలేదు. ఇలాంటి ఘటనలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయా అని ఆశ్చర్యపోతారు. కల్పన కంటే నిజం వింతగా ఉంటుంది. ‘మనకు ఎదురుకాని అనుభవాలన్నీ మిథ్యే అనుకుంటాం’ అనేది ఈ సినిమాకు ఆధారమైన నవలలో ఒక ట్యాగ్ లైన్. గాంధీ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకు 20 ఏళ్లు పట్టింది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా మేకింగ్ కోసం మేము పదేళ్లు సమయం తీసుకున్నాం. తెరపై మేము ఆవిష్కరించబోతున్న కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ – ఈ సినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టమైన సుదీర్ఘ ప్రయాణం చేశాం. పదేళ్ల మా శ్రమ తర్వాత మా సినిమాను ప్రేక్షకులు తెరపై చూడబోతున్నారనే సంతోషం కలుగుతోంది. కోవిడ్ టైమ్ నుంచి మేమంతా అనుకోని, మర్చిపోలేని ప్రయాణం ఈ సినిమాతో చేశాం. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) లాంటి గొప్ప సినిమాలో భాగమవడం గర్వంగా ఉంది. దర్శకుడు బ్లెస్సీ అద్బుతమైన విజన్, ఆ విజన్ కు తన సంగీతంతో ఏ ఆర్ రెహమాన్ ప్రాణం పోశారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) మా దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదు మా మనసుల్ని తాకిన ఒక గొప్ప కథ. ఈ కథ మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులు కూడా ఇలాగే అనుభూతి చెందుతారని కోరుకుంటున్నాం అన్నారు.
90 వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కే ఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇది చదవండి : ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ చేతుల మీదుగా ‘రవికుల రఘురామ’ మూవీ సాంగ్ “ప్రాణాలే” విడుదల !!!
నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కే ఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ – సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
మ్యూజిక్ – ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
నిర్మాణం – విజువల్ రొమాన్స్
దర్శకత్వం – బ్లెస్సీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ప్రసన్న వదనం మూవీ (Prasanna vadhanam Movie)
యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సుహాస్ తన అమ్మ నాన్నల ఫోటోని గుర్తుపట్టని హాస్పిటల్ సీన్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసింది. టీజర్ లో చూపించిన పాత్రల మొహాలపై బ్లర్ ఎఫెక్ట్ తో ప్రజెంట్ చేసి, తర్వాత ఈ కథ వెనుక వున్న అసలు కాన్సెప్ట్ ని రివిల్ చేశారు. ‘ఫేస్ బ్లైండ్ నెస్’ నేపధ్యంలో ఈ కథ ఉండబోతుంది. దర్శకుడు కాన్సెప్ట్, క్రైమ్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ ప్లే లో బ్లెండ్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా వుంది. సుహాస్ గతంలో ఎన్నడూ చేయని ఇంటెన్స్ పాత్రలో కనిపించారు. తన సహజమైన నటనతో మెస్మరైజ్ చేశారు. వైవా హర్ష, నందు, నితిన్, హర్ష వర్ధన్ పాత్రలు కూడా కీలకంగా కనిపించాయి. టీజర్ కి విజయ్ బుల్గానిన్ అందించిన నేపధ్య సంగీతం సస్పెన్స్ ని మరింత ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ యూనిక్ కాన్సెప్ట్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాలా క్యురియాసిటీ పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. టీజర్ అద్భుతంగా వుంది. కథలోని పాయింట్ అదిరిపోయింది. టీజర్ చాలా నచ్చింది. సుకుమార్ గారి అసోసియేట్ అర్జున్ ఈ సినిమాని డైరెక్టర్ చేయడం చాలా ఆనందంగా వుంది. టీజర్ చాలా నమ్మకాన్ని ఇచ్చింది. టీజర్ లో అందరూ బాగా చేశారు. విజయ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కథ నచ్చితే మ్యూజిక్ చేసే కంపోజర్ తను. మణికంఠ కలర్ ఫోటోకి సహా నిర్మాతగా చేశాడు. తనకి సినిమా అంటే పాషన్. ఈ సినిమా విజయం సాధిస్తే తను మరింత దూకుడుగా సినిమాలు చేస్తాడు. సుహాస్ కి చాలా కీలకమైన సినిమా ఇది. తను చాలా బిజీగా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ..’ప్రసన్న వదనం’ సినిమా చాలా బావుటుంది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. దర్శకుడు అర్జున్ కి ధన్యవాదాలు. తను సుకుమార్ గారి అసోసియేట్. అర్జున్ నరేషన్ సుకుమార్ గారిలానే వుంది. ఫేస్ బ్లైండ్ నెస్ మీద చేస్తున్న చాలా మంచి థ్రిల్లర్ ఇది. సినిమా చాలా బావొచ్చింది. అవుట్ పుట్ అదిరిపోయింది. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలు మణికంఠ, ప్రసాద్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పాషన్ తో నిర్మించారు. సినిమాకి కావాల్సినది సమకూర్చారు. పాయల్, రాశి మంచి నటన కనబరిచారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది పక్కాగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా. అందులో డౌట్ లేదు’ అన్నారు.
దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. ముందుగా మా గురువు గారు సుకుమార్ గారికి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన నాలెడ్జ్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. ప్రసన్న వదనం కథకు సుహాస్ యాప్ట్. నన్ను చాలా సపోర్ట్ చేశారు. సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం. నిర్మాతలు సినిమాకి బ్యాక్ బోన్ లా నిలబడి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. రాశి, పాయల్, నితిన్ అందరూ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్ టీం అంతా ది బెస్ట్ ఇచ్చారు. సినిమా చాలా సూపర్ గా వచ్చింది. అందరికీ నచ్చుతుంది.” అన్నారు.
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. ప్రసన్న వదనం కథ వినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. చాలా మలుపులు వున్నాయి. ఇందులో నా పాత్ర కూడా కొత్తగా వుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుహాస్ అద్భుతమైన నటుడు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు.
నిర్మాతల మాట్లాడుతూ.. ముందుగా సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. అర్జున్ ఈ కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. తను సుకుమార్ గారి అసోసియేట్. కథ సుకుమార్ గారి మీటర్ లో ఉన్నప్పటికీ అర్జున్ కి అంటూ ఒక స్పెషల్ స్టయిల్ వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. సుహాస్ గారు మరింత కొత్తగా కనిపిస్తారు. ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా వుంటుంది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. త్వరలోనే సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తాం.’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఇది చదవండి:
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
లంబసింగి మూవీ (Lambasingi Movie)
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.
‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సోంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
నటీనటులు:
భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: ఆనంద్.టి
బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్
కెమెరామెన్: కె.బుజ్జి
సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్
ఎడిటర్: కె.విజయ్ వర్ధన్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
ఇది చదవండి: ‘మార్కెట్ మహాలక్ష్మి’ నుంచి “సాఫ్ట్వేర్ పోరగా” సాంగ్ రిలీజ్
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
“సాఫ్ట్వేర్ పోరగా (Software Poraga)” లిరికల్ వీడియో సాంగ్
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు.
వినూత్న ప్రమోషన్లతో సినిమా సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి పాట “సాఫ్ట్వేర్ పోరగా (Software Poraga song)” లిరికల్ వీడియోను ఆవిష్కరించారు. మన మార్కెట్ మహాలక్ష్మి (Market Mahalakshmi) ప్రణీకాన్విక మనసుని గెలుచుకోవాలనే తపనతో సాఫ్ట్వేర్ ఉద్యోగి పార్వతీశం చేసిన ప్రయత్నాలను ఈ సాంగ్ ద్వారా వివరిస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మార్కెట్ నుండే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న హీరో, అతను ఎదుర్కొనే పరిస్థితులు ఎంతో ఆహ్లాదకరంగా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ ‘విఎస్ ముఖేష్’ రాసిన పదాలు, జో ఎన్ మవ్ గ్రూవీ బీట్లు మరియు లోకేశ్వర్ ఎడార యొక్క ఎనర్జిటిక్ వాయిస్ ఈ క్రేజీ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా అలరింప చేస్తుంది. ఈ సాంగ్ రాబోయే రోజుల్లో వైరల్ గా అయ్యే అవకాశం పుష్కలంగా కనబడుతున్నాయి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి, కూరగాయల వ్యాపారి కి మధ్య జరిగే ప్రేమకథే ఈ చిత్రం. అతి త్వరలో థియేటర్లలో సినిమా సందడి చేయనుంది.
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు….
ఇది చదవండి: ఏప్రిల్ 12 న రోటి కపడా రొమాన్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల
టెక్నికల్ టీమ్:
రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్
ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు
ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్
సంగీతం: జో ఎన్ మవ్
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
పాటలు: వియస్ ముఖేష్, మిష్టర్ జో
బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి
కొరియోగ్రఫీ: రాకీ
ఆర్ట్ డైరెక్టర్: సంజన కంచల
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక పాండ
పోస్టర్ డిజైనర్: రానా
పీఆర్వో: తిరుమలశెట్టి వెంకటేష్
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance) సినిమాలోని నటులు
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఈచిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేది ఖరారు ప్రెస్‌మీట్‌ను బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ కథను నమ్మి ఎమోషనల్‌గా ఫీల్ అయి చేసిన సినిమా ఇది. నేను మొదట్నుంచి కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రేక్షకులు కూడా నాకు అన్ని విధాలా సపోర్ట్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ కథను కూడా ఇష్టపడి, నమ్మి చేస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ దర్శకుడి కావాలన్న నా 15 ఏళ్ల కల నాకు ఈ సినిమాతో తీరుతుంది. మొదట్నుంచీ తన సంస్థలో ప్రతిభగల నటీనటులను, సాంకేతిక నిపుణులకు సపోర్ట్ చేసే వేణుగోపాల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. అయితే కమర్షియల్‌గ ఏ రేంజ్ హిట్ అన్నది మాత్రమే ఇప్పుడే చెప్పలేను. ఇది అందరూ అనుకున్నట్లు కేవలం ఎంటర్టైన్మెంట్ సినిమానే కాదు, అన్ని రకాల ఎమోషన్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఇట్స్ ప్యూర్ ఫిలిం. లైఫ్‌లో ఒక్కసారైనా అందరూ లవ్ అనే ఎక్స్‌పీరియన్స్‌ను చూసి వుంటారు. అలాంటి వారందరికి మా సినిమా కనెక్ట్ అవుతుంది అన్నారు.
ఈ సినిమా అందరికి నచ్చుతుందని, ఇది కేవలం యూత్‌ఫుల్ సినిమానే కాదు అన్ని వర్గాల వారికి నచ్చుతుందని హీరోల్లో ఒకరైన హర్ష తెలిపారు. తమ మీద నమ్మకం వుంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు తమ థ్యాంక్స్ తెలియజేశారు తరుణ్, సుప్రజ్. ఈ సమావేశంలో కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్లు సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరలు పాల్గొన్నారు.
ఇది చదవండి: ఆకట్టుకుంటున్న ‘లైన్ మ్యాన్’ మూవీ ట్రైలర్…
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్
ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం
కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
లైన్ మ్యాన్ (Line Man) :
తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. మాండ్య ప్రాంతంలోని సమీప గ్రామాల్లోని అక్కడి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే నటరాజ్ అనే జూనియర్ లైన్ మ్యాన్ ఇంట్రడక్షన్ తో ప్రారంభం అవుతుంది. గ్రామంలో అందరూ నటరాజ్‌ను నట్టు అని పిలుస్తుంటారు. పవర్ స్టార్ రెఫరెన్స్‌తో నటరాజ్ ఇంట్రడక్షన్ ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అలాగే గ్రామంలోని ఇతర పాత్రలను కూడా ఇందులో పరిచయం చేశారు. త్రిగుణ్‌కి ఎదురయ్యే ప్రశ్నలు మనకు నవ్వును తెప్పిస్తుంటాయి. ఆ గ్రామంలో దేవుడమ్మ వెయ్యికి పైగా కాన్పులను చేసుంటుంది. ఆమె 100 వ పుట్టిన రోజును జరుపుకోవటానికి గ్రామస్థులందరూ సిద్ధమవుతారు. అదే సమయంలో గ్రామంలోని వారంత కరెంట్ లేకుండా నాలుగు రోజులు ఉండటానికి నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయానికి కారణమేంటని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
ట్రైలర్లో తెలియని ఆహ్లదంతో పాటు తెలియని గందరగోళం ఉందని తెలుస్తుంది. లైన్ మ్యాన్ అయిన త్రిగుణ్ ఎందుకని గ్రామానికి కరెంట్ ఇవ్వకుండా ఆపేస్తాడు. అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అది తెలియాలంటే మార్చి 15 న విడుదలవుతున్న మూవీ చూడాల్సిందే. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ రోలర్ కోస్టర్ ప్యాక్డ్గా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. మార్చి 15 న ‘లైన్ మ్యాన్’ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో త్రిగుణ్ కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. ప్రాంతీయ సినిమాకున్న హద్దులను సైతం చేరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. మాండ్య బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా ఆడియెన్స్‌కు నచ్చుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
త్రిగుణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా కాజల్ కుందెర్, బి జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. శాంతి సాగర్ హెచ్ జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రఘునాథ ఎడిటర్ వర్క్ చేస్తున్నారు. కాద్రి మణికాంత్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నటీనటులు: త్రిగుణ్, కాజల్ కుందెర్, బి జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ, మైకో నాగరాజ్, చేతన్ గంధర్వ, దిలీప్ కుమార్, సందీప్ కెంపగౌడ, శ్రీదత్త, సమర్థ్ నర్సింహులు, సుహైల్ రసూల్, గౌరవ్ శెట్టి తదితరులు
సాంకేతిక వర్గం :
రచన, దర్శకత్వం – వి రఘు శాస్త్రి
నిర్మాణం – పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్
సహ నిర్మాతలు – ప్రచూర పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘు శాస్త్రి, భళా స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – గణేష్ పాపన్న
సినిమాటోగ్రపీ – శాంతి సాగర్ హెచ్ జి
ఎడిటర్ – రఘునాథ ఎల్
మ్యూజిక్ – కాద్రి మణికాంత్
ఆర్ట్ – సూర్య గౌడ
పి.ఆర్.ఒ – వంశీ కాకా, హరీష్ అరసు
పబ్లిసిటీ డిజైన్స్ – రాజ్సో క్రియేటివ్స్
లేబుల్ – సారిగమ ఇండియా లిమిటెడ్, ఏ ఆర్పి ఎస్ జి గ్రూప్ కంపెనీ
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 151574