సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డీ మార్ట్ (D Mart) లోని ఫుడ్ ప్రొడక్ట్ లో చచ్చిపోయిన ఎలుక కలకలం సృష్టించింది…
రామచంద్రాపురం పరిధిలోని డీమార్ట్ (D Mart) లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ పిల్లలు తినే స్నాక్స్ తీసుకునేందుకు ర్యాక్ వద్దకు వెళ్లగా చచ్చిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. స్నాక్స్ ప్రొడక్ట్స్ తీసుకోగా అందులో నుంచి దుర్గంధం రావడంతో పరిశీలించిన కస్టమర్ కు క్షుణ్ణంగా పరిశీలించగా కుళ్ళిపోయిన ఎలుక కనిపించింది.దీంతో అవాక్కైనా సదరు కస్టమర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఫుడ్ ప్రోడక్ట్ లో ఎలుక రావడంతో పక్కనున్న మిగిలిన కస్టమర్లు సైతం ఆందోళనకు దిగి స్టోర్ సిబ్బందిని నిలదీశారు.
డీమార్ట్ స్టోర్ లో సిబ్బంది నిర్లక్ష్యం..
నిత్యావసర సరుకులు కొనడానికి అనేకమంది కస్టమర్లు డీమార్ట్ కు వస్తారని అటువంటి స్టోర్ లో ఇంత నిర్లక్ష్యంగా సిబ్బంది వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. తప్పు జరిగిందని, చూసుకోలేదని డీ మార్ట్ నిర్వాహకులు దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు, మీడియాకు చెప్పొద్దని సదరు కస్టమర్ ను బతిమాలడి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని అన్ని ప్రొడక్టుల క్వాలిటీ ని పరిశీలించి నిర్లక్ష్యంగా ఉన్న డీమార్ట్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..
- వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR… - స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు… - ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..






Total views : 141448