మంత్రి అంబటి రాంబాబు కి మాజీ మంత్రి ఆలపాటి రాజా కౌంటర్ ఇచ్చారు. శవాలను గుట్టలుగా వేసుకొని పోస్టు మార్టం మీరు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. సకాలంలో కాల్వ తవ్వలేని, మురుగు కాల్వ బాగుచేయలేని మంత్రి అంబటి రాంబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా రాజకీయ మనుగడ లేని వ్యక్తి అంబటి రాంబాబు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ మండి పడ్డారు. సంక్షేమ ముసుగులో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి మద్యపానాన్ని నిషేదిస్తాను అన్న మాట తప్పారు అంటూ ఎద్దేవా చేశారు.
jagan mohan reddy
నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు, ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన తంబు శీను, వల్లభోని మల్లికార్జున, వల్లభోని వెంకటేశ్వర్లు, కొక్కిలిగడ్డ ప్రసాద్, కొక్కిలిగడ్డ వెంకట్రావు, కొక్కిలిగడ్డ కృష్ణారావు, నాయుడు రాజు, నాయుడు రాము, నాయుడు లక్ష్మణ్, నాయుడు సురేష్, పల్లెపాటి బాబులు, వల్లభోని నరసింహారావు లు పార్టీలో చేరగా… నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తూ పాత, కొత్త నాయకులు అందరు కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే కందుకూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను చూడలేక, వైసీపీ నుంచి అనేకమంది బయటికి వస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు.
బాపట్ల జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 13వ రోజు అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 13 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీ పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకే తెలుగుదేశం – జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని ఆలపాటి రాజా తెలిపారు. టిడిపికి పోస్ట్ మార్టం చేయాలని మంత్రి అంబటి మాట్లాడుతున్నారని.. పోస్ట్ మార్టం చేయాల్సింది వైసిపీకేనని విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చినప్పుడే వారి ఓటమి ఖరారయిందన్నారు. తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. క్షేత్రస్థాయిలో జగన్ పంట పొలాలను పరిశీలించకుండా పరదాల చాటున వచ్చి రైతుల్ని పలకరించకుండానే వెళ్లిపోయారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి.. మహిళలను దారుణంగా మోసగించారన్నారు. నాడు – నేడు విద్యారంగంలో సంస్కరణలంటూ ప్రచారం చేస్తున్నారని… కానీ ఆరు లక్షల మంది విద్యకు దూరమయ్యారని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆలపాటి రాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి 2K రన్ స్దానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ 2K రన్ శ్రీకాళహస్తి ప్రభుత్వ జడ్పీ పాఠశాల నుంచి నాలుగు మాడ వీధులలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీనివాసులు, పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు 2K రన్ లో క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలను క్రీడాకారులను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీయడానికి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఒక వేదిక అవుతుందని, దీనిని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. గ్రామ వాలంటీర్లు మొబైల్ ఫోన్ల ద్వారా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారులకు రిజిస్టర్ చేసే అవకాశం ఉందన్నారు. దీన్ని గ్రామస్థాయి క్రీడాకారులు మరియు క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వినియోగించుకోవాలని క్రీడాకారులను కోరారు.
Read Also..
మాజీమంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాo విలేకర్ల సమావేశంలో యువగళం నవశకం అనంతరం వైఎస్సార్సీపీ బెంబేలెత్తి పోయింది. దాదాపు 5లక్షల మంది హాజరైన నవకశం సభ, ప్రజలు ఏరకంగా వైఎస్సార్సీపీ పట్ల విముఖతతో ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఒకచోట పనికిరానటువంటి వ్యక్తిని మరొక చోట తీసుకెళ్లి పెట్టిన ఏరకంగా ఆ వ్యక్తి చెల్లుబాటు అవుతారనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. ఈ యువగళం పాదయాత్ర ఇదేమీ ముగింపు కాదు ఇది ఒక నవశకానికి ఆరంభం. చంద్రబాబు చెప్పినట్లుగా జనసేన పొత్తు రేపటి ఆంధ్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం. రెండూ పార్టీలు ప్రజా ప్రయోజనాల కోసo పొత్తుతో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమయ్యింది. రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి రేపటి ఎన్నికల్లో 165 స్థానాల్లో ఎమ్మెల్యేల గెలుపు, 25 ఎంపీల గెలుపు ఈ గెలుపు రేపటి ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది, జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం అనేక రకాలుగా చట్టాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఇవన్నీ తొలగిపోతాయి. అరాచక ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించటo టీడిపి, జనసేన ల లక్ష్యం, పొత్తు యొక్క ఉద్దేశ్యం. రేపు జరుగబోయే ఎన్నికలు జగన్మోహన్రెడ్డికి ఆంధ్రులు ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆత్మగౌరవం మధ్య జరిగే యుద్ధమిది, జగన్మోహన్రెడ్డి అవమానించి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్రజా ఆస్తుల్ని దోచుకుంటున్న తరుణంలో రేపు ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓటు వేస్తారనేది సందేహం లేదు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్రెడ్డి కి బైబై చెప్పటానికి సమాయాత్తమయారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన సమ్మె శుక్రవారం 11 రోజుకు చేరింది. ఇందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు, నిర్మలమ్మ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో అంగన్వాడి టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతానని మాట ఇచ్చి మాట తప్పారని జగన్ సర్కార్ పై అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తామని జగన్ సర్కార్ కు హెచ్చరించారు. రోడ్డుపై భిటాయించి ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం తీసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
Read Also..
కడప జిల్లా… ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే గాక, ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను, మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్ప మరే ప్రభుత్వంలోనూ నిరుపేదలకు ఈ నియోజకవర్గంలో ఇల్లు మంజూరు కాలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం నేతలు కేవలం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప, టిడిపి ప్రభుత్వం ఏ నిరుపేదకు ఏ ఇల్లు ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. ప్రజా నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోములవారి పల్లి జగనన్న కాలనీలో నూతన ఇళ్లను ఎమ్మెల్యే రాచమల్లు ప్రారంభించారు. నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి నియోజక వర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్ళ నిర్మాణం విషయంలో కొంత ఆలస్యమైనా అర్హులకు సిఎం పుట్టిన రోజున వెయ్యి ఇళ్లు పూర్తి చేసి అందిస్తున్నామన్నారు. మీనపురం, బొల్లారం జగనన్న కాలనీలలో కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో 17 వేల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామన్నారు. అయితే నియోజక వర్గంలో 24 వేల ఇళ్లు ఇవ్వటమే కాక వాటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకున్నామన్నారు. సోములవారి పల్లెలోని రామేశ్వరం జగనన్న కాలనీ ఇళ్ళ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీనుపల్లి లక్ష్మీదేవి, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి, పద్మ చెలియా, కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, వైసిపి నాయకులు నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్ర రెడ్డి, వరుకూటి ఓబుల్ రెడ్డి, పిట్ట బాలాజీ పాతకోట వంశీధర్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్ ఇతర నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు..
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సంక్షేమ సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల అభ్యున్నత కోసం అడుగడుగునా పరితపిస్తూ నవరత్న పథకాలతోటే పేదల తలరాత మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను, చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని వైస్సార్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో కోలాహాలంగా ఏర్పాట్లు నిర్వహించామని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. అంతేకాకుండా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఎన్నార్టీ రోడ్డు లో గల పాత పశువుల సంత ప్రక్కన గోల్కొండ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని మేము ఇచ్చే ప్రేమ విందును స్వీకరించాలని కోరారు.
మనసున్న మహామనిషి, మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిరకాలం వర్ధిల్లాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. సారవకొట మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కొలమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిధిగా, రాష్ట్రాభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని 51వ ఏట అడుగుపెట్టారని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వరాలతో చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Total views : 140797