స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి పది నుండి 15 లక్షలు విదేశీ విద్యకు విధులు కేటాయించి పేదలకు విదేశీ విద్య అందించడం జరిగిందని అటువంటి పథకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులకు అగౌరవం అన్నారు. టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి రుణాలు అందించి ఆదుకుంటే వైసిపి పాలనలో జగన్ రెడ్డి కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా దగా చేశాడని ఎద్దేవా చేశారు. 50 వేల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే దళితులపై ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఐదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు అని ప్రశ్నించారు. దళిత వాడలకు 200 యూనిట్లు లోపు కరెంటు ఉచితంగా చంద్రబాబు నాయుడు నాడు అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు ఎత్తివేసి అధిక బిల్లులతో దళితులను దోపిడీ చేశారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన చేసిన దుర్మార్గాలను మర్చిపోరని, అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే నైతిక హక్కు లేదని అన్నారు.
jagan mohan reddy
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా సింగరాయకొండ కి చెందిన వ్యాపారవేత్త తాటిపర్తి చంద్రశేఖర్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. అయితే శనివారం నియోజకవర్గానికి వస్తున్న సంధర్బంగా త్రిపురాంతకం, యర్రగొండపాలెం లో స్వాగత ఫ్లెక్సీలు ఎర్పాటు చేసారు. ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు. త్రిపురాంతకం లోని ఫ్లైఓవర్ కు ఫ్లెక్సీ ఎర్పాటు చేయగా ఫ్లెక్సీ ను చించి వేశారు. యర్రగొండపాలెం లో మంత్రి సురేష్ అతిధి గృహానికి వెళ్ళే రహధారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలను చించి వేశారు. సీసీ కెమేరాలు లేని చోట ఫ్లెక్సీలు చించడంతో ఎవరో కావాలనే ఫ్లెక్సీలను చించారని వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. దీంతో ఫ్లెక్సీల గొడవ యర్రగొండపాలెంలో చర్చాంశనీయంగా మారింది. ప్లెక్సీలను చించిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగుజాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం మురమళ్ల లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అప్రజాస్వామిక జీవో పత్రాలు భోగి మంటల్లో వేసిన టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు.. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కుటుంబ సభ్యులు. ఈ పండుగతో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వం పోయి టిడిపి, జనసేన ల కలయికలో రాష్ట్రం స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుందని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ఇక్కడతో రాష్ట్రానికి జగన్ రూపంలో పట్టిన శని పోవాలని కోరారు.
జగన్ సిఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. రోజా వేసిన ప్రైవేట్ కేసు విచారణలో భాగంగా బండారు నగరి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైనశైలిలో సైకో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టి, జైల్లో నిర్భందించి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. నెల రోజుల్లో చంద్రబాబు – పవన్ పాలన వస్తుందని, జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్ రాష్ట్రంలో ఉండడని, జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే అన్నారు. నోరు మంచిది అయితే ఊరు మంచిదవుతుందని, రోజా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని బండారు హితవు పలికారు.
Read Also..
వైసీపీ మూడో జాబితా విడుదల అయింది. ఇప్పటికే రెండు విడతలు విడుదల చేసిన సీఎం జగన్ మూడో లిస్టు ఖరారు చేశారు. మొత్తం 21 మందితో కూడిన జాబితాను తాజాగా విడుదల చేశారు. నిజానికి బుధవారమే ఈ లిస్టును విడుదల చేయాల్సి ఉంది. పలువురి విషయంలో స్పష్టత రాకపోవడంతో ఈ రోజు విడుదల చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో చర్చించిన తర్వాత 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇంచార్జులను ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోనూ పలువురికి ఇంచార్జులుగా అవకాశం కల్పించారు. ఈ జాబితాలో విజయనగరం లోక్సభ కు చిన్న శ్రీను, ఏలూరు లోక్సభ కు కారుమూరి సునీల్ కుమార్, విశాఖపట్నం లోక్సభ- బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం లోక్సభ- పేరాడ తిలక్, విజయవాడ లోక్సభ- కేశినేని నాని, కర్నూలు లోక్సభ- మంత్రి గుమ్మనూరి జయరాం, తిరుపతి లోక్సభ- కోనేటి ఆదిమూలం ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. ఇచ్ఛాపురం- పిరియ విజయ, టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి (ఎస్సీ రిజర్వుడ్)- కంభం విజయ రాజు, రాయదుర్గం-మెట్టు గోవిందరెడ్డి, దర్శి- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు (ఎస్సీ)- ఎం సునీల్ కుమార్, చిత్తూరు- విజయానందరెడ్డి (ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్) ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. మదనపల్లి- నిస్సార్ అహ్మద్, రాజంపేట- ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కోడుమూరు- డాక్టర్ సతీష్, ఆలూరు- బూసినే విరూపాక్షి, కోడుమూరు (ఎస్సీ)- డాక్టర్ సతీష్, గూడూరు- మేరిగ మురళి, సత్యవేడు (ఎస్సీ)- డాక్టర్ మద్దిల గురుమూర్తి, పెనమలూరు- జోగి రమేష్, పెడన- ఉప్పాల రాము అపాయింట్ అయ్యారు.
మంత్రి గుడివాడ అమర్నాధ్ తన టికెట్ విషయంపై స్పందించారు. తనకు టికెట్ భయం లేదని తన రాజకీయ భవిష్యత్ ను సీఎం జగన్ నిర్ణయిస్తారని అన్నారు. రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభిస్తున్నామని ఈ పరిశ్రమను కర్నూలు జిల్లాలోని పెట్నికోట గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ విలువ 2500 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు విషయంపై స్పందిస్తూ.. అంబటి రాయుడు రాజకియాలలో ఇమడలేరన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలవడం, తాను వైసీపీలో చేరతానని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని నాని అనుచరుడు బొమ్మసాని సుబ్బారావు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. తాము టీడీపీలోనే ఉంటామని లోకేశ్ కు స్పష్టం చేశారు. టీడీపీని వదిలి వచ్చేది లేదని తాము కేశినేని నానితో చెప్పిన విషయాన్ని కూడా బొమ్మసాని.. లోకేశ్ కు వివరించారు. జగన్ ఇంటి గడప తొక్కిన కేశినేని నానితో ఇక కలిసేదే లేదని తేల్చి చెప్పారు. బొమ్మసాని ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు స్థానం టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో లిస్టు ప్రకటనను వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది. మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో లిస్టు విడుదలను వాయిదా వేశారు. మూడో జాబితాలో 14 స్థానాల్లో సీఎం జగన్ మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. మూడో లిస్టును సీఎం జగన్ ఫైనల్ చేసేశారని, కాసేపట్లో ఆ జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు. ఇప్పటివరకు జగన్ 38 స్థానాల్లో ఇంఛార్జిలను మార్పులు చేశారు. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో బహిరంగంగానే సీఎం జగన్ ని విమర్శిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి బహిరంగ సభ వేధికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్ధసారధి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ సీఎంవోకి పిలిపించి మాట్లాడిన టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో అసంతృప్తితోనే వెనుతిరిగారు. అయితే ఈ సంధర్భంగా రాజ్యసభ ఏంపీ అయోద్యరామి రెడ్డి, పార్దసారధి కార్యలయానికి వెళ్లి అరగంట పాటు చర్చించిన టికెట్ విషయంలో క్లారిటీ రాలేదనే విషయం తెలుస్తుంది. దీనితో పార్దసారధి వైసీపీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
Read Also..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రజా ఆరోగ్యం కొరకు తమ ఆరోగ్యాలను పాడు చేసుకుని విధుల నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనంగా 26000 చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పారిశుద్ధ్య కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ నిత్యవసర ధరలు పెరుగుతుంటే చాలీచాలని వేతనాలతో పారిశుధ్య కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం న్యాయపరమైన తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో భాగంగా నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.






Total views : 141415