ఎండాకాలం తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్నది ఎండాకాలం కాబట్టి.. నీటి అసవరాలకు అనుగుణంగా అత్యవసరం అయితే.. నీళ్ల కోసం KRMBకి లేఖ రాయాలని సూచించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలు, కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ తాగు నీరు అందేలా సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, శాఖల సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే.. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగర్ నుంచి ఏపీ 9 TMC లకు పైగా నీరు తీసుకుపోతోందని అధికారులు సమావేశంలో వివరించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నారని, సరైన గణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
KRMB
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను సమీక్షించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి కృష్ణా జలాల అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు కీలక నేతలు సైతం తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించారని భారత్ రాష్ట్ర సమితి భారీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
జగన్ తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని, ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే రెండు ప్రాజెక్టులు మొదలయ్యాయని కేసీఆర్ పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీశ్ రావు సహకరించారని పేర్కొన్నారు. ఇక, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశాడని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుంచి నీళ్లే కాదు, బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నాలు ఉన్నాయని విమర్శించారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవాలన్నది జగన్ ప్రణాళిక అని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి 8 టీఎంసీల నీరు తరలించడానికి కేసీఆర్ అనుమతించారని ప్రగతిభవన్ లోనే జగన్, కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. Read Also..
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అధికారులు ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుపడుతున్నాయి. దీంతో బోర్డు అధికారులు జోక్యం చేసుకొని ఏపీకి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సారధ్యంలో ఇప్పటికే సమావేశం జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఏపీకి కేటాయించిన నీటి విడుదల విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. అనుమతి మేరకు 5 టీఎంసీల నీటి విడుదల కోసం ఏపీ అధికారులు ప్రయత్నించగా, తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఆర్ఎంబీ సభ్యుడు అజయ్ కుమార్, ఈఈలు రఘునాథ్, శివశంకరయ్య ప్రాజెక్టును సందర్శించి ఐదు, ఏడో నంబర్ గేట్లు ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తాత్కాలికంగా తెలంగాణ ఆధీనంలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఏపీ పోలీసులను వెంటబెట్టుకుని వచ్చిన ఆ రాష్ట్ర ఇంజనీర్లు ప్రాజెక్టుపైకి చొచ్చుకువచ్చి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పరిణామంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా కేఆర్ఎంబీకి అప్పగించాలని స్పష్టం చేశారు.
నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. కేంద్ర జలశక్తి శాఖ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సూచించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందించింది. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. సాగర్ డ్యామ్ ను తమ అధీనంలోకి తీసుకోనున్నాయి. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సాగర్ డ్యామ్ కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాలు పోలీసుల వలయంలో ఉన్నాయి.





Total views : 151084