శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత . విద్యార్థినులు తమ సమస్యలపై మంత్రికి నేరుగా లేఖ రాయడంతో మంత్రి స్వయంగా వచ్చి విద్యార్థులతో ముచ్చడించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలపై విద్యార్థినిలు వ్యక్తిగతంగా మంత్రి సవిత తో మాట్లాడారు. ముఖ్యంగా హాస్టల్ ఇంచార్జ్ ఎస్ఓ శాలిని దేవి తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో ఇంచార్జ్ ఎస్ ఓ హాస్టల్ నుండి బయటికి వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని, అని తెలియజేశారు. మంత్రి హాస్టల్ లోని వంటగది నీ పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కాయగూరలను చూసి హాస్టల్ వార్డెన్ తో మీ ఇంటికి కూడా ఇలాంటి కాయగూరలతో భోజనాలు చేస్తారంటూ ఆగ్రహాన్నివెలిబుచ్చారు . బాత్రూమ్స్ లో పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్ శాలిని దేవి వ్యవహార శైలిపై , ఆమెపై వచ్చిన ఆరోపణలతో వెంటనే శాలిని దేవి పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…
- నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు…
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్ల ఆర్డర్లను టెస్కొ సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ… ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నా స్థలానికి…
- ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మెగా సానిటేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాగంగా ములుగు ఎస్సీ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలను తొలగించారు. వసతి గృహన్ని అధికారులతో కలసి శుభ్రం…
- సింగరేణి కార్మికులకు శుభవార్త.సింగరేణి మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141165