ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన. గత 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగబాబు
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికుల న్యాయ పరమైన కోరికలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సి.పి.ఐ.యు నాయకులు గొల్లపూడి ప్రసాద్, జనసేన నాయకులు సిరిపురం సురేష్, దారపురెడ్డి నాగభూషణం, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.
ntr district
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడులో ఉద్రిక్తత. సీఐ సమక్షంలోనే అనుమానిత వ్యక్తి పై గ్రామస్థుల దాడి. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతడిని కారులో ఎక్కించుకొని వెళ్తుండగా అడ్డగించిన గ్రామస్తులు. పోలీసులు వినియోగించిన ఆ ప్రైవేటు కారును ధ్వంసం చేసి. సీఐ, ఎస్సై సమక్షంలోనే త్రినాధ్ పై స్థానికులు దాడి. గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్, మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆ 3 వ్యక్తులు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని, ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్ లో విజయవాడ వైపుకు వెళ్తున్న గుడ్లవల్లేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఎటువంటి ఆధారాలు లేని నగదుగా గుర్తించి కేసు నమోదు చేసిన చిల్లకల్లు పి.ఎస్ సబ్-ఇన్స్పెక్టర్ కృష్ణబాబు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కి రాబోయే ఎన్నికల్లో సీటు లేదంటూ స్పష్టం చేసిన టీడీపీ అధిష్ఠానం. నిన్న సాయంత్రం నాని నీ కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు. 7వ తేదీ చంద్రబాబు తిరువూరు సభకు కేశినేని నాని నీ దూరం పెట్టిన పార్టీ. తిరువూరు లో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జీ గా నియమించనున్న చంద్రబాబు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నాయ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలపై సాటి మహిళలు అని కూడా కనికరం లేకుండా అసభ్యకరమైన వాఖ్యలు చేసినందుకు నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషా శ్రీ చరణ్ ఫోటోకి చెప్పుల దండ వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద 12 వ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ లు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం, భక్తుల కు ఎంతో ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకొని మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారదర్శనం లో కనువిందు చేసారు. తెల్లవారుజామున నుండి భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారదర్శనం లో వీక్షించేందుకు బారులు తీరారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్ద ప్రసాదాలు అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ప్రారంభించారు. అనంతరం తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ…. పార్టీ బలోపేతం చేయడానికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా నందిగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని… అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే స్థానం అనేది చాలా విలువైనదని… ఆ పదవిలో ఉంటే ప్రజలకు ఏపని అయినా చేయవచ్చని రమాదేవి అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం లో ఏసీబీ ట్రాప్, ఫారెస్ట్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఏ.రామకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి, రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన రైతు గండిపూడి రాంబాబు అనే వ్యక్తి రామకృష్ణ కి 23వేలు లంచం ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు ఫారెస్ట్ కార్యాలయం దగ్గర్లో రామకృష్ణ అద్దెకు ఉండే గదిలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ బృందం.
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలో దాహం కేకలు గొంతు ఎండిపోతుంది గుక్కెడు నీళ్లు ఇప్పించండి కార్యక్రమాన్ని చేపట్టిన తిరువూరు జనసేన నాయకులు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పసుపులేటి నరేష్ మిత్ర(పండు)మాట్లాడుతూ తిరువూరు పట్టణంలో దాహం కేకలు వేస్తుందని ప్రజలకు రోజువారి మంచినీళ్లు ఇవ్వకుండా రెండు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇస్తున్నారని మూడు నెలలో ఎండాకాలం వస్తుందని ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి ఇప్పటికైనా అధికారులు,నాయకులు తెలుసుకోవాలి అని అన్నారు. ఈ ప్రభుత్వం కృష్ణాజలాలు తిరువూరుకి అందజేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ వారు చేపట్టిన పనులలో ఎటువంటి పురోగతి సాధించలేదని కృష్ణాజలాలు తిరువూరు వాసులకు అందని ద్రాక్షా లాగా మారాయని ఇకనైన ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి-పసుపులేటి నరేష్ మిత్ర (పండు)అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగినేని సుధాకర్(అడ్వకేట్),పసుపులేటి రవీంద్ర,పాపారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.





Total views : 141008