కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం కె సీతారమపురం హైవే ప్రక్కన ఎస్సీ ఏరియాలో ఇంటి వద్ద ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగిలించే క్రమంలో స్థానికులకు పట్టుబడ్డ ఇద్దరు దొంగలు. దొంగల వద్ద స్వాధీన పరుచుకున్న ద్విచక్ర వాహనం. స్థానికులు దొంగలను హనుమాన్ జంక్షన్ పోలీసులుకు అప్ప చెప్పిన వైనం. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
political news
శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక ‘శ్రీవాణి’ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం శ్రీసిటీ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బిజినెస్ సెంటర్ లో నిర్వహించిన ప్రఖ్యాత కవయిత్రి, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రగాఢ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి కార్యక్రమం సంగీత, సాహిత్య ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర, టీటీడీ శ్వేతా మాజీ డైరెక్టర్ భూమన్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య భూమన కుసుమ కుమారి, వెంగమాంబ రీసెర్చ్ స్కాలర్ గంధం శంకర్రావు ముఖ్య అతిధులుగా పాల్గొనగా, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు.
జ్యోతి ప్రజ్వలన, కుమారి మల్లాది అనూష ప్రార్ధనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలు, శ్రీవారిపై ఆమె సాహిత్యం, విశిష్ట శైలి గురించి భూమన్, భూమన కుసుమ కుమారి, శంకర్రావు తమ ప్రసంగంలో వివరించారు.
ప్రముఖ విద్వాంసులు, స్వరకర్త, గాయకులు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) చైర్మన్, వెంకటగిరి వెలుగోటి రాజకుటుంబ వారసుడు డాక్టర్ వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర చేసిన తరిగొండ వెంగమాంబ కీర్తనల స్వరకల్పనలో గాయకులు కొన్నింటిని రాగయుక్తంగా ఆలపించారు.
డా.కుసుమ కుమారి మాట్లాడుతూ ‘వెంకటాద్రి మహిమ’ పురాణం నుంచి ‘ద్వీపద భాగవతం’ వరకు ఆమె రచనలు సరళత, స్పష్టత, ప్రగాఢ భక్తితో ప్రతిధ్వనిస్తాయన్నారు. శ్రీవేంకటేశ్వరునిపై ఆమెకున్న అమోఘమైన విశ్వాసం ‘ముత్యాల హారతి’లో వ్యక్తమైందని, ఇది నేటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచరిస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో ఆచరిస్తున్న ఈ రోజువారీ సేవ, వెంగమాంబ ఆధ్యాత్మిక వారసత్వానికి శాశ్వత నివాళిగా ఆమె పేర్కొన్నారు.
వెంగమాంబ రచనలకపై డా. యాచేంద్ర స్వరకల్పన చేసిన ‘ఆడినే శివుడాడీనే’, ‘ఏమి తపము చేసివమ్మా’, ‘ఆడెనే బాలకృష్ణుడు ఆడెనే’, ‘బ్రహ్మదేవుడొచ్చెను’, మరికొన్ని పాటలను యువ గాయకులు మల్లాది అనూష, పవిత్ర, శివ శ్రవణ్, నరేష్ కూడా కొన్ని పాటలను ఆలపించారు.
వీరికి వాయిద్య కళాకారులు బాబు (కీబోర్డు), వెంకట్రావు (తబలా), నటరాజ్ (ఫ్లూట్), చిల్లర సుబ్రమణ్యం (తాళం), శంకర్రావు (వ్యాఖ్యాత) అద్భుతమైన సహకారాన్ని అందించారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవానికి వచ్చిన అతిథులందరికీ సాదరంగా స్వాగతం పలికి, శ్రీవాణి ద్వారా ఏడాదిగా నిర్వహిస్తున్న వివిధ భక్తిమయ, సంగీత, సాహిత్య ప్రదర్శనలు మరియు సంగీత సాహిత్య ప్రియులను అవి ఎలా ఆకట్టుకుందో వివరించారు.
వెంగమాంబ స్వరాంజలి కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ యాచేంద్ర, భూమన్, డా. కుసుమ కుమారి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, గతంలో అన్నమయ్య సంకీర్తనావళి తరహాలో ఈ కార్యక్రమం కూడా శ్రీవాణి ద్వారా శ్రీసిటీయేతర ప్రాంతాలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, తరిగొండ వెంగమాంబ (1730-1817) తన జీవితాన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేసింది. ఆమె ఔత్సాహిక కవులకు స్ఫూర్తిదాయకంగా, భక్తులలో నమ్మకం, విశ్వాసం నింపే మార్గదర్శిగా మిగిలింది. ఆమె జీవితం మరియు రచనలలోని గొప్పదనం భగవంతుడు, మానవాడు మధ్య కళల యొక్క సామర్థ్యాన్ని ఒక వంతెనలా మనకు గుర్తు చేస్తాయి.
వెంగమాంబ మనోహరమైన భక్తిమయ రచనలు, చిరస్థాయిగా కొలువుండేలా భక్తుల హృదయాలలో ఆమె సుస్థిరస్థానం పొందింది. ఈమె రచనలలో యక్ష గానాలు, ఆధ్యాత్మిక గేయాలు, పద్యకృతులు, పద్యకావ్యాలు, ద్విపదకావ్యాలు, తాత్విక కావ్యాలు వంటి వివిధ సాహితీ ప్రక్రియలు దర్శనమిస్తాయి. తాత్విక కావ్యాలలో రాజయోగామృతసారం గొప్ప పేరు పొందింది.
శ్రీసిటీ పీఆర్వో పల్లేటి బాలాజీ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో శ్రీసిటీ పరిసర ప్రాంతాలతో పాటు శ్రీహరికోట, చెన్నై, నెల్లూరు, సూళూరుపేట ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు, పలమనేరు నియోజకవర్గం లో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. గంగవరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహం ప్రారంభోత్సవం చేసిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం అంజద్ భాష మినిస్టర్ గుమ్మనూరు జయరాం నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గంగవరం నుండి పలమనేరు వరకు బస్సు యాత్ర ప్రారంభమైంది ఈ బస్సు యాత్రలో భారీగా తరలివచ్చిన జనం. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు భార్య రెండు పర్సెంట్ అని చెప్పింది రెండు పర్సెంట్ అంటే 4 వేల కోట్లు రైతు పాలు పిండి చెమటోడ్చి నీ డైరీ కి పాలు పోస్తే రైతులు కూడా నువ్వు మోసం చేశావు అంటూ నెల్లూరు అనిల్ కుమార్ మాట్లాడాడు, అదేవిధంగా ఇంకో మహానుభావుడు ఉండాడు దత్తపుత్రుడు అతను ఈడేం పీకలేడు కానీ పక్క రాష్ట్రంలో పీకుతామని పోయాడో ఆడ ఎనిమిది సీట్లు నిలబడితే 350 ఓట్లు కూడా పడలేదు ఈ దత్తపుత్రుడు మమ్మల్ని ఏమో చేసేస్తాడంట అంటూ స్వెటర్ వెసాడు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రజలకు కాసం సేపు ఊపు తెప్పించాడు అనిల్ కుమార్ కూడా కాసేపు దద్దరిలే మాటలు మాట్లాడాడు, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చంద్రబాబు పైన రాధాకృష్ణ పైన దద్దరిలే మాటలు మాట్లాడాడు నీ బిడ్డలు మాత్రము ఫారిన్లో చదువుకోవచ్చు అదే పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో ట్యాబ్ ఇస్తే పిల్లలకు ట్యాబ్ లు ఇచ్చే చెడిపేస్తా ఉండారని లేనిపోని నిందలంతా వేస్తావా అసలు నువ్వు మనిషేనా అంటూ నారాయణస్వామి మాట్లా డి నారు, ఈసారి మీరు వేసే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడతాడు ప్రతి ఒక్కరు నోటి నుంచి అదే మాట ప్రజలకు చెప్పారు జై జగన్ జై జగన్ ఈసారి ఓటు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకే ఓటు వేయాలని మళ్ళీ మీరు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని కోరుకుంటున్నాను అని మీకందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకి విన్నవించారు.
కాకినాడ, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీలో మరోసారి బయట వర్గపోరు. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబుకు వ్యతిరేకంగా సమావేశమైన అసమ్మతి వర్గం. ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు. దొరబాబును ఇంచార్జ్ పదవి నుండి తప్పించి మరొకరిని ఇంచార్జ్ ఇవ్వాలనే అజెండాతో ముందుకు వెళ్తున్న అసమ్మతి వర్గం…
పల్నాడు జిల్లా, గురజాల వైసీపీలో అసమ్మతి సెగ, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న- ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పల్నాడు జిల్లా మాచవరం పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాట్ కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న, శాసనమండలి విప్పుగా పదవి వస్తే అభినందన సభకు కూడా జనాన్ని రానీయకుండా అడ్డుకున్నారు. ఇంకా ఎన్నాళ్లు మీ అరాచకాలు, నియోజకవర్గంలో నా అభిమానులకు ఏ ఆఫీసులకు వెళ్లిన పని చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఎవరు జండా పట్టని టైంలో వైసీపీ జెండాను భుజాన వేసుకొని మోసాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీ అధికారంలో రావటానికి కృషి చేశాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడుతుంటే గురజాలలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మండలానికి ఇద్దరు ముగ్గురు మాత్రమే పెత్తనం చెలాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. ఇక మీ ఆటలు సాగనివ్వం ఎమ్మెల్సీ జంగా పల్లకి మోసేది మేము పెత్తనం మరొకరిదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య జిల్లా, రాయచోటి పిడి హౌసింగ్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పై దాడికి ప్రయత్నించిన మరో వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి. అవమానంతో పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమేష్ నాయక్…తన భార్యతో కలిసి హౌసింగ్ కార్యాలయంలోనే ధర్నాకు దిగిన రమేష్ నాయక్… రాయచోటి జగనన్న కాలనీలో వర్క్ ఇన్స్పెక్టర్ లుగా పని చేస్తున్న రమేష్ నాయక్, హరి ప్రసాద్. నాకు నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగిన వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి, పీలేరు డి ఈ గోపాల్ నాయక్, రాయచోటి డి ఈ చంద్రశేఖర్, హౌసింగ్ పిడి సాంబ శివయ్య లదే బాధ్యత. ఎస్పీ కి పిర్యాదు చేయనున్న రమేష్ నాయక్ కుటుంబ సభ్యులు. మీడియా వస్తున్న విషయాన్ని తెలుసుకొని అదృశ్యమైన ఉన్నత అధికారులు…..
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగాల నాయకులు గూడవల్లి నరసింహారావు ఇంటిపై అల్లరి మూక దాడికి నిరసనగా, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రసాదంపాడు నుండి రామరపాడు రింగు రోడ్డు వరకు ఆందోళన నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టి జాతీయ రహదారిపై బైఠాయించి, దాడికి పాల్పడిన అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేసి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేసే క్రమంలో పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది, విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యానికి నేరుగా వెళ్లి దాడి ఘటన గురించి కంప్లైంట్ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం నాయకులు.
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెంలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ప్రతీ జిల్లాలో కేంద్ర సహకారంతో చేస్తున్న అన్ని పనులు పరిశీలిస్తున్నాము, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిచేస్తాం. రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి పనికి కేంద్రం సహకరిస్తుంది, పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడుకోవాల్సి ఉండగా, ప్రతీ రాజకీయ పార్టీ డబ్బు తోడుకుంటుంది. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అన్ని వివరాలు వెల్లడిస్తాను, ఏలూరులో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 525 కోట్లు కేంద్రమే ఇచ్చింది, రేచర్ల నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కు అవుతున్న 11 వందల కోట్లు కేంద్రమే భరిస్తున్నది, రాష్ట్రం భూమి మాత్రమే తప్పా, మరేది ఇవ్వలేదు, జగనన్న కాలనీల్లో ఇళ్లు తేలిగ్గా కూలిపోయే పరిస్థితి వచ్చింది. జగనన్న ఇళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి, రాష్ట్రంలో పేదవారికి ఒక్క మంచినీటి కుళాయి ఇచ్చే పరిస్థితి లేదు, అమృత్ పథకం ద్వారా ఏలూరు కార్పొరేషన్ లో 2 వేల కోట్లు మంచి నీటి కోసం ఇచ్చింది, బీజేపీ ఓటు లేదు.. మాకు ఓటు బ్యాంకు లేకపోయినా, మాకు ప్రజల సంక్షేమమే ముఖ్యం, రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషపూరిత పరిపాలన సాగుతోంది, ఆడుదాం ఆంధ్ధా ఏమో కానీ, ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు, ప్రతీ విషయంలోనూ అవినీతి, ఒక్క పరిశ్రమ రాలేదు..కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరిలిపోతున్నాయీ. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. యస్ సీ, బీసీలకు రాష్ట్రంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు. అమరావతి నిర్మాణానికి టీడీపీ హయాంలో 1500 కోట్లు ఇచ్చాము. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 20వేలు కోట్లు కేటాయిస్తే, ఇంతవరకు రాష్ట్రం భూ సేకరణ చెయ్యలేదు. లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉన్నాం. మాకు జనసేనతోనే పొత్తు ఉంది.. వారు మాతోనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పరిస్థితిపై సీయం చేసిన కామెంట్ల గురించి ఆయననే అడగండి.





Total views : 149995