సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.
political news
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితోపాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తి అయ్యాయి. 2019లో ఇదే రోజున సీఎం జగన్ మూడు రాజధానులపై ప్రకటన చేశారు. దానిని నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు ఉద్యమ బాట పట్టారు. రాజధాని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమం నేటితో 1,461వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరులో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు సర్వమత ప్రార్థనలు చేసి ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాడివేడీ చర్చల తర్వాత ఈ నెల 20వ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా, పంచ్ డైలాగ్‌లు, ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప ఏముంది చెప్పుకోవడానికి అంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో అయినా కేసీఆర్ పాల్గొంటారా? అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
Read Also..
Read Also..
ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో పర్యటించనున్నారు. ఈరోజు కాశీ పర్యటనలో నాడేసర్ లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రాంభిస్తారు. రేపు విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రాంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాధం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోధీ బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్ తో సహా ఐదు రైళ్లును ప్రారంభించనున్నారు.
రాజమండ్రి గైట్ మైదానంలో జనవరి 5 6 7 తేదీలలో అంతర్జాతీయ తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అల్లూరి సాంస్కృతిక కళాక్షేత్రం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్ర సర్వహక పరిషత్ చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలలో నాలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ఇద్దరు కేంద్రమంత్రులతోపాటు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి లకు ఆహ్వానం పంపినట్లు ఆయన తెలిపారు. లక్ష మంది వరకు తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత భోజన సదుపాయం వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జనవరి 2 తేదీన పదివేల మంది విద్యార్థిని, విద్యార్థులతో రాజమండ్రిలో శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Read Also..
Read Also..
చేనేత జౌళీ రంగాలపై పునర్వైభవం కోసం అధికార యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు సకాలంలో నిధులు విడుదల చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించి తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. చేనేత పరిశ్రమలకు భారీగా పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. డిజైనింగ్, శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోచంపల్లి గద్వాల చేనేత పరిశ్రమల కు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను గ్రీన్ పార్క్ గా తీర్చిదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎందుకు సంబంధించిన ప్రణాళికలపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్ లో BAFEL ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రాంచీస్ ను వి.సుమబాల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సెంటర్ సిఇఓ ఆయుష్ గుప్తా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఆవశ్యకత ఎంతో ఉందని, అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ బాష ను చేరువ చేసి సమాజంలో ముందుకు వెళ్లడానికి ఈ సెంటర్ ఎంతో దోహద పడుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్దె అనురాధ మాట్లాడుతూ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చదువులకు నిలయమైన విజయవాడలో BAFEL అకాడమీ స్థాపించబడటం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి గా సంస్థ వ్యవస్థాపకురాలు అల్కా గుప్తా, ఏపీ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఎడ్యుకేషన్ సీఈఓ ఎమ్ ఎల్ ఎస్ దేవ కుమార్ పాల్గొన్నారు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25 వేల మంది వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గం లో ని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రకు తరలిరాన్నుట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజిని మెరుగ నాగార్జున శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ లో ఛైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో గత నాలుగున్నర సంవత్సరాలో వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే మళ్ళీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు.






Total views : 150545