తిరుపతి, రేణిగుంట అంగన్వాడీల అరెస్టుకు సిఐటియు ఖండన. కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేయబడ్డ మహిళలను తక్షణం విడిచి పెట్టాలని వారి ప్రజాస్వామ్యతమైన నిరసన కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేతగాక మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
tirupathi
అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతీకరమైన లడ్డూలను అయోధ్య రామయ్య సన్నిధికి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి లక్ష లడ్డూలు తరలించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. అయోధ్య లో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఉదయం ఈ విమానం ప్రారంభమవుతుందని. సాయంత్రంలోగా అయోధ్యకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.
తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు. కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్, ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు. అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అధికారులు, పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె.
సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలు దొంగలించి లారీలో వేసుకొని వెళ్తుండగా సినీ పక్కిలో వారిని వెంబడించి దాడులు నిర్వహించి దాదాపు లారీ తో సహా నాలుగు టన్నుల పైబడి ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు, సత్యవేడు సిఐ సర్కిల్ కి చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం గోడౌన్లో కాపలా దారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డ ఎర్రచందనం దొంగలు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని ఖచ్చితమైన సమాచారంతో వారం రోజులుగా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పచెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది. ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయ నుంది. మార్చి మాసానికి సంబంధించిన దర్శన, సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం భక్తులకు అవకాశం లభిస్తుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని టీటీడీ తెలిపింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల విడుదల చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల విడుదలవుతాయి. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. దాతల దర్శనం, గదుల కోటా వెలువరిస్తారు. 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.
తిరుపతి జిల్లా రేణిగుంట, రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం బెంగళూరు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం వారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కి తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిధి గృహం వద్ద స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,344
మంది భక్తులు దర్శించుకుని. మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం. 4.26 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…17,616 మంది, శ్రీవారి సర్వదర్శనానికి 05 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 08 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ఈనెల 21 అనగా రేపు సూళ్లూరుపేట రానున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కి భారీ బందోబస్తు చేస్తున్న అధికారులు. రేపు సూళ్లూరుపేట కు చేరుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా దాదాపుగా 2,000 మంది పోలీసుల తో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం…….