Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు 50శాతం పెంచాలని నిర్ణయం..

ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు 50శాతం పెంచాలని నిర్ణయం..

by CVR NEWS

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50 శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన కనుక అమలైతే, లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుండి 816కి పెరుగుతుంది. దేశంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి పెరుగుతాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి..ఏపీలో 263కు పెరగనున్నాయి అసెంబ్లీ స్థానాలు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు వీలుగా సంబంధిత చట్టాలకు సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2029 ఎన్నికల నుంచే అమలుచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: