Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Main News పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు

పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు

by Rama
పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు

వరుస పేపర్ లీక్ లతో సతమతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైనవారిపై చట్టపరంగాచర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తీసుకువచ్చింది. పరీక్షల పేపర్ లీక్ ల గందరగోళం మధ్య, కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ ని అమలు చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పరీక్షల్లో అవకతవకలపై కఠిన చర్యలకు నిబంధనలు రూపొందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పబ్లిక్ పరీక్షా విధానంలో మరింత పారదర్శకత, సరసత, విశ్వసనీయతను తీసుకురావడానికి అన్యాయమైన మార్గాలను నిరోధించడం దీని లక్ష్యం. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి షురూ అవ్వడంతో అమలు తేదీని ప్రకటించలేదు.పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్దంగా పరీక్ష పేపర్లను అందుకున్నా..ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్ వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, ఫేక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10ఏండ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దీనిలో భాగస్వాములు, వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు.పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.
    షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
  • సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
    భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం ‘సెమీకాన్‌ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
  • జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
    నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు. అలాగే యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు…
  • 96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.
    96 సంవత్సరాల తర్వాత బౌండరీస్‌ చట్టం ప్రకారం జిల్లాలో రీ-సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.…
  • లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.
    బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్‌ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్‌ మిషన్‌ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: