Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh బాపట్ల జిల్లాలోయువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం..

బాపట్ల జిల్లాలోయువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం..

by Rama
బాపట్ల జిల్లాలోయువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం..

బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఈపురుపాలెంలో తెల్లవారుజామును బహిర్భూమికి వెళ్లిన 21ఏళ్ల సుచరిత అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం చేశారు. మహిళపై జరిగిన హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి అనిత జిల్లాలోని చీరాల మండలం ఈపురుపాలెంలో హత్య జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీస్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకొని సుచరిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సుచరిత కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.బాపట్ల జిల్లాలోయువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం.. అనంతరం విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తాలూకా గంజాయి మూలాలు ఇంకా ఉన్నాయని వీటిపై ఉక్కు పాదం మోపుతామని నిందితులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించి తీరుతామని ఆమె అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023089
Total views : 140873

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.