Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana కేసీఆర్‌ను మించిన మోసగాడు..రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అర్వింద్.

కేసీఆర్‌ను మించిన మోసగాడు..రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అర్వింద్.

by Prakash
mp aravindh fires on revanth reddy

కేసీఆర్‌ మీద కల్వకుంట్ల కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఒక్కసారిగా మాట మార్చారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యపోయే కామెంట్లు చేశారు. అది కూడా రేవంత్ రెడ్డితో పోల్చుతూ.. ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మాట్లాడిన అర్వింద్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావటం అసంభవమని.. బీజేపీకే స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకపోతే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అర్వింద్.

ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు అర్వింద్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి.. కేసీఆర్‌ను మించిన మోసగాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు ఎవరూ లేరన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళ్తే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని త్వరలోనే బయటపెడతానని చెప్పుకొచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

023107
Total views : 140939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.