Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని నరేంద్ర మోదీ హామీ..

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని నరేంద్ర మోదీ హామీ..

by Satya
Narendra Modi

దేశవ్యాప్తంగా త్వరలో పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలను తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోను ఢిల్లీలో మోదీ విడుదల చేశారు. దేశాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గించడంతో పాటు ఆటో మొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాల్లో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళతామని తెలిపారు. దేశంలో ఇప్పటికే 5జీ అమలు చేస్తున్నామని, త్వరలో 6జీ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు.

ఇది చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తొలి రోజు విచారణ..

ఏజెన్సీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి గిరిజనులకు మేలుకలిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.అభివృద్ధికి, సంస్కృతికి బీజేపీ సమ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ చెప్పారు. సోషల్‌, డిజిటల్‌, ఫిజికల్‌ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతామని తెలిపారు. శాటిలైట్ పట్టణాల నిర్మాణం ఇప్పటికే మొదలుపెట్టామని గుర్తుచేశారు. వందేభారత్ స్లీపర్, వందేభారత్ మెట్రో, బుల్లెట్ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టిస్తున్నామని మోదీ వివరించారు. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ వివరించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

022998
Total views : 140723

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.