ట్రాక్టర్ లీజు (Tractor Lease) :
అమాయక రైతులను మోసం చేసి 57 ట్రాక్టర్లను లీజు (Tractor Lease) పేరుతో తీసుకెళ్లి అమ్మేసుకున్న మోసగాళ్లు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తాడిమర్రి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు రవికుమార్ భయ్యా రెడ్డి, హాజీపేరా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు ఈ రోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఇది చదవండి : వైసిపి పై బురద జల్లాలని చూస్తున్నారు – కావటి
దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ…
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామానికి చెందిన దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా నిందితులు రైతుల వద్ద నెలకు 25 వేల రూపాయలు బాడుగ ఇస్తామని చెప్పి ట్రాక్టర్లను తీసుకొని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది అన్నారు.
పులివెందులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ట్రాక్టర్లను విక్రయించిన విషయం తెలుసుకొని తాడిమర్రి పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తాడిమర్రి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల విలువ నాలుగు కోట్ల 56 లక్షల రూపాయలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులను సైతం త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.decoding="async" width="150" height="150" src="https://cvrnews.net/wp-content/uploads/2026/06/TDP-and-JSP-150x150.webp" class="attachment-thumbnail size-thumbnail wp-post-image" alt="కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి" style="" srcset="https://cvrnews.net/wp-content/uploads/2026/06/TDP-and-JSP-150x150.webp 150w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/TDP-and-JSP-25x25.webp 25w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/TDP-and-JSP-300x300.webp 300w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/TDP-and-JSP-90x90.webp 90w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/TDP-and-JSP-585x585.webp 585w" sizes="(max-width: 150px) 100vw, 150px" title="కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి. 6cvrnews%">
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…








Total views : 141294