Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Sports Hyderabad Vs Bangalore : బెంగళూరు రెండో విజయం..

Hyderabad Vs Bangalore : బెంగళూరు రెండో విజయం..

by Satya
Hyderabad Vs Bangalore

ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్‌(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్‌ అహ్మద్‌ (40) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (31), కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (31) చెలరేగారు.

ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో విజ‌యం..

మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, గ్రీన్‌, కర్ణ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్‌ జాక్స్‌, యశ్‌ దయాల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన డుప్లెసిస్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ 51, రజత్‌ పటిదార్‌ 50, కామెరూన్‌ గ్రీన్‌ 37, డుప్లెసిస్‌ 25 పరుగులతో రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్‌ 2, కమిన్స్‌, మార్కండే ఒక్కో వికెట్‌ తీశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌
    క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్‌ విమానంలో ప్రయాణించిన సచిన్‌… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
  • ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.
    ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
  • భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.
    దిగ్గజ షూటర్‌, ప్రఖ్యాత కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్‌ ఈయన కోచింగ్‌లోనే రాటుదేలిన సంగతి విదితమే. ISSF వరల్డ్‌ కప్‌లో భాగంగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023147
Total views : 141202

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.