Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో వైఎస్ జగన్…

YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో వైఎస్ జగన్…

by Satya
YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో వైఎస్ జగన్…

YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా దీనికి అనుగుణంగా టీడీపీ కూడా మద్దతు పలికింది.ల్యాండ్ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని ఆనాడు టిడిపి సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది.కానీ ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి . నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదు. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయి. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుంది.టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుంది.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.
    మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్‌ గ్యాంగ్‌ ట్రెన్‌ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ హతమైనట్లు అమెరికా…
  • కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
    కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
  • ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
    ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
    ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
  • అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.
    అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023188
Total views : 141373

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.