Saturday, October 3, 2026
News Navigation
Saturday, October 3, 2026
News Navigation

Breaking

Saturday, October 3, 2026
Home National ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

by Satya
Kailash Gahlot

ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఆప్‌ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్‌(CM Kejriwal) కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్‌ గెహ్లాట్‌(Kailash Gahlot)కు నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గెహ్లాట్‌ ప్రస్తుతం నజఫ్‌గంజ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించిన ప్యానల్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జ్‌ విజయ్‌ నాయర్‌ వాడుకోవడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్‌ తరచూ ఫోన్‌ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 1 వరకు ఆయన ఈడీ పరిధిలో ఉండనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైలులో ఉన్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి…


సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ …
ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్రకు ప్రధాని మోదీ నివాళి.
ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ …
ఉద్యోగులకు కేంద్రం కీలక నిర్ణయం.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: