Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Film లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి ‘ఎవరితో పయనం’ సాంగ్ విడుదల…

లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి ‘ఎవరితో పయనం’ సాంగ్ విడుదల…

by Prakash
Love Mocktail 2


కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 (Love Mocktail 2) మూవీ నుంచి ‘ఎవరితో పయనం’ సాంగ్ విడుదల..

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన “లవ్ మోక్టైల్ 2” (Love Mocktail 2) మూవీ నుంచి ఎవరితో పయనం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 చిత్రాలతో కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.

లవ్ మోక్టెల్ 2 సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం…

ఈ సందర్భంగా నిర్మాత ఎం వి ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ : కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడు. అతను దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కి సంబంధించిన పాటను నేడు విడుదల చేసాం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రమోషన్ ఆక్టివిటీస్ తో గ్రాండ్ గా మీ ముందుకు వస్తాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా అలాగే కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. కథలో శివరాజ్ కుమార్ గారి వేద సినిమాకి తెలుగు ప్రేక్షకులు హిట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇ లవ్ మోక్టెల్ 2 సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

నటీనటులు :
డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్

టెక్నికల్ టీం :
నిర్మాణం : కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
మ్యూజిక్ : నకుల్ అభయాన్కర్
డిఓపి మరియు ఎడిటర్ : శ్రీ క్రేజీ మైండ్స్
కథ మరియు దర్శకత్వం : డార్లింగ్ కృష్ణ
పి ఆర్ ఓ : మధు VR

Follow us on: Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, …
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026157
Total views : 149979

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.