Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Film యమధీర మూవీ టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్…

యమధీర మూవీ టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్…

by Prakash
Yamadhira

యమధీర (Yamadhira) :

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టీజర్ ప్రముఖ నటులు & ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారు లాంచ్ చేయడం జరిగింది.

ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…
ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన తన స్నేహితుడు యాక్టర్, ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది అని వేదాల శ్రీనివాస్ గారు తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భంగా అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ… తన స్నేహితులు వేదాల శ్రీనివాస్ గారు కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు. కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ గారు ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం అని అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే దూకుడు ని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.

ప్రొడ్యూసర్ : వేదాల శ్రీనివాస్

తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.

టెక్నికల్ టీం :
కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్
మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర
ఎడిటింగ్ : సి రవిచంద్రన్
సంగీతం : వరుణ్ ఉన్ని
కథ & దర్శకత్వం : శంకర్ ఆర్
పిఆర్ఓ : మధు వి ఆర్

మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026077
Total views : 149862

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.