Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Film అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న నవీన్ చంద్ర వెబ్ సిరీస్ “ఇన్స్పెక్టర్ రిషి”

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న నవీన్ చంద్ర వెబ్ సిరీస్ “ఇన్స్పెక్టర్ రిషి”

by Prakash
Inspector Rishi

Inspector Rishi Web Series :

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్…ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న నవీన్ చంద్ర.. ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎల్ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. దీంతో నేరుగా ఆయన లీడ్ రోల్ లో కోలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇన్స్ పెక్టర్ రిషి. అమోజాన్ తమిళ్ ఒరిజినల్స్ గా ఈ సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

హారర్ క్రైమ్ కథతో ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. ఎలాంటి క్లూ లేకుండా జరుగుతున్న హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర ఈ వెబ్ సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అంతు చిక్కని ఈ హత్యల వెనుక ఎవరున్నారు అనేది సస్పెన్స్, హారర్ అంశాలతో ఆసక్తికరంగా ఇన్స్ పెక్టర్ రిషిలో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ఏలెవన్, సత్యభామ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్.
తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, …
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్.
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' …
త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల.
శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023036
Total views : 140766

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.