Politics
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన నామినేషన్ ను అధికారులు రిజక్ట్ చేసారు. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈయన తో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి మొత్తం 28 నామినేషన్లు దాఖలు చేసారు. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే నామమాత్రంగానే తాను నామినేషన్ వేసినట్లు జానారెడ్డి చెప్పుకొచ్చారు.
వనపర్తి జిల్లాలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో “నేను తప్పనిసరిగా ఓటు వేస్తాను” అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. అదేవిధంగా ఓటర్ గైడ్ అనే హాండ్ బుక్ ను ఆవిష్కరించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి ఓటరు తన ఓటును తప్పనిసరిగా వేయాలని అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు ఆశపడకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 70పైగా గెలుస్తుందని ధీమ వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…జిల్లాలో యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకానికి అనుమతులు మంజూరు చేసి…ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులను తక్షణమే తొలగించాలన్నారు. ఇక ఈ అంశంపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. ఈసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేదుకు ఎన్నికల సంఘం చూస్తుంటే, జగిత్యాల జిల్లాలో మాత్రం యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు. జిల్లాలో అసలు యంత్రాంగం ఉందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కుత్బుల్లాపూర్ సుభాష్ చంద్రబోస్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పై గాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మోసాలను, బీజేపీ హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. కమల వికాసం కనిపిస్తుందని…నా నామినేషన్ కు వచ్చిన జనాలను చూసి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల గుండెల్లో దడ పుట్టింది అన్నారు.బీఆర్ఎస్ పార్టీ స్కీములు పేరిట అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంది మాట్లాడారు. బీసీ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది,ఎస్సి వర్గీకరణ కృషి చేసింది బీజేపీ యే అన్నారు.బీఆర్ఎస్ లా దళిత బందు పేరిట దళితులను,బీసీ బందు పేరిట బీసీ లను, గిరిజన బందు పేరిట ఎస్టీలను మోసం చేయలేదు వ్యాఖ్యనించారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతే అమెరికా పోతాడు.. కాంగ్రెస్ అభ్యర్థి వ్యవసాయం చేస్కుంటా అంటున్నాడు.. నేను మాత్రం ఎప్పుడు షాపూర్ నగర్ లోనే ఉంటా..ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్ని ఆశీర్వదించండి.. గేటెడ్ కమ్యూనిటీల్లో, జూబ్లీహిల్స్ లో ఉండే వాళ్ళను తరిమికొట్టండి.బీజేపీ కి ఓటేసి.. అభివృద్ధికి పట్టం కట్టండి..బీఆర్ఎస్, కాంగ్రెస్ లను బొందపెట్టి… బీజేపీ తో జట్టు కట్టండి..అంటూ ప్రచారం చేశారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్, మజ్లీస్ పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెవంత్ రెడ్డి ఇటివలె మజ్లీస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. ఈ నేపద్యంలో అక్బరుద్దీన్ స్పందించారు. రేవంత్ రెడ్డి తమను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన హిందూ – ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ జోలికి రావొద్దని, వస్తే కనుక ఆయన జీవితచరిత్ర బట్టబయలవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్సెస్ నుంచి వచ్చాడని, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని అన్నారు. తెలంగాణలో రెడ్డి, రావు, ఎవరైనా సరే మా ముందు వంగాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ – పాకిస్తాన్ రెండు ముక్కలైందని, లేదంటే ఒకే దేశంగా ఉండేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ తెలంగాణలో వివిధ తేదీలలో మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వెల్లడించింది. ఒకేరోజు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రి-యాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనల తేదీలను పార్టీ ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీల అగ్రనేతల పర్యటనలు ఉండేలా చూస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి హాఫిజ్ పెట్ డివిజన్ శాంతినగర్ చందానగర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ.. ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని శేరిలింగంపల్లిలో భారీ మెజారి విజయం సాధిస్తామని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి, గజ్వేల్ సహా 80 స్థానాలు గెలవడం ఖాయం అని జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్ లో సోమ వారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎకరానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అంటే బి ఆర్ ఎస్ నాయకులు మొత్తం మూడు గంటలే అని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని స్పష్టం చేశారు
రానున్న ఎన్నికల పోరులో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరగబోతున్నదని ఈ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి, కలకోట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ పాలకులు అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకోవడం వల్ల ప్రజలకు సంపద అందకుండా పోయిందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామన్నారు .ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.





Total views : 152349