తుఫాను ప్రభావంతో పంట పోలాలు నీట మునగడంతో… రైతులను ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరామర్శించారు.
నీట మునిగిన వరి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి, శనగ , ప్రత్తి,మినుము పంట పొలాలను సందర్శించారు. మోకాలు లోతులో నీరు ఉన్న పొలంలోకి వెళ్లి రైతుల నుండి ఎంత నష్టపోయారో అడిగి తెలుసుకున్నారు. అదైర్యపడవద్దు, ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన నష్టపరిహాన్ని వచ్చే విధంగా టీడీపీ తరఫున పోరాటం చేస్తాము అని చెప్పారు. కాలవలలో పూడికతీత పనులు చేయకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ కొరకు కేటాయించిన భూములు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి చేతగానితనానికి ఈ ప్రాంతం ఒక నిదర్శనం అని పేర్కొన్నారు . పూర్తిగా మొలిచిన తుమ్మ చెట్లతో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు.
Tag:
burla ramanjaneyulu
టీడీపీ, జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుంది – టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు.
by Prakash
written by Prakash
ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ మాకినేని పెద్ద రత్తయ్య ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూర్ల రామాంజనేయులు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ హాజరవ్వగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సంఘాల నాయకులు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం తనకి ఎప్పటినుంచో సుపరిచితమని ప్రతిపాడు లో అఖండ మెజార్టీతో టిడిపిని గెలిపించుకుంటానని ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు తెలిపారు.. టిడిపి జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుందని అన్నారు..