తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ నేతలు మేడ్చల్‌కు ఐటీ పార్క్ తీసుకువస్తామని చెప్పారని, కానీ ఏమయిందో చెప్పాలన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంశంపై కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకువచ్చినా తరలించలేదన్నారు.
Congress party
దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతే అని అన్నారు సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి.శ్రీనివాస్. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ రాజకీయ స్వలాభం కోసమే బి.జె.పి పార్టీ మైనారిటీలపై ఆంక్షలు విధించింది అని అక్కడ జరిగిన ఎన్నికల పర్యావాసనాలు చవి చూడక తప్పులేదని గుర్తు చేశారు. దేశంలో మైనారిటీలకు ఏదైన లబ్ధి చేకూరిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చొరవే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వక్ఫబోర్డు ఆస్తుల రక్షణతో పాటు మైనారిటీ విద్యార్థులకు పూర్తి స్థాయి ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువులు చదివేందుకు స్కాలర్ షిప్ లు అందిస్తామని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం బి.జె.పి బి.ఆర్.ఎస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు. మరో మారు ఆ పార్టీలకు అవకాశమిస్తే కేంద్రంలో బి.జె.పి రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ ల చేతిలో చావుదెబ్బ తప్పదన్నారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఆశోక్ నగర్ లోని తన కార్యాలయంలో గాలి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లు కష్టపడ్డానని, కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు. స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని, బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. గత ఐదేళ్లక్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆనాడు – ఈనాడు నాకు మోసం జరిగిందన్నారు. నేషనల్ పేపర్ లకు యాడ్స్ ఇవ్వడం తో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులతో పాటు నాకు ED నోటీసులు అందాయన్నారు. ఇంత జరిగిన రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పలకరించలేదని వాపోయారు. తీవ్ర మనస్థాపం చెంది కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తూ ఏఐసీసీ ఇంచార్జీ ఖర్గే కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేశారు.
Read Also..
తెలంగాణ ఎన్నికలు సందర్బంగా రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారం లో 70 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులకు కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారని ఎంపీ బండి సంజయ్ కీలకవ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసు అధికారులు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.30 వేల కోట్లతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష 30 వేల కోట్లకు పెంచి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై లాఠీచార్జి చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుంచి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కి కూడ చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు.కరీంనగర్లో చెల్లని రూపాయి పొన్నం ప్రభాకర్ అని అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సోలిపెట్,మద్దూరు, హైతాబాడ్, చందన్ వెళ్లి, రుద్రారం, పోత్గల్ మరియు గోపిగడ్డ గ్రామాలలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన పామేన జ్యోతి భీమ్ భరత్.. ఈ ప్రచారంలో భాగంగా అమే ప్రతి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినా ఆరు గ్యారంటీ పతకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్ధి భీం భారత్ ను గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంచి స్పందన ఉందని కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భీమ్ భారత్ గెలిచి అసెంబ్లీకి వెళ్తాడని ధీమా వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పిసరి సురేందర్ రెడ్డి, షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ మరియు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Read Also..
2004లో రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బూర్గంపాడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును, గుణాన్ని చూడాలన్నారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర, వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? పేదలు, రైతుల పట్ల వారి తీరు ఎలా ఉంది? అని ఆలోచించాలని సూచించారు. అలా చూస్తేనే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలుస్తారన్నారు. తెలంగాణ వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఆ సమయంలో కరెంట్ సమస్య ఉండేదని, ఇప్పుడు దానిని పరిష్కరించుకున్నామన్నారు. కులం, మతం భేదం లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి, గజ్వేల్ సహా 80 స్థానాలు గెలవడం ఖాయం అని జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్ లో సోమ వారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎకరానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అంటే బి ఆర్ ఎస్ నాయకులు మొత్తం మూడు గంటలే అని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని స్పష్టం చేశారు
బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు మాట్లాడుతూ….రాహుల్ గాంధీ జోఢో యాత్ర తో ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్య వంతులు అయ్యారు.,రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతున్నది అన్న నమ్మకం ప్రజలలో కలుగుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపకుండా అక్రమ కేసులు పెడుతున్నారు, రేపు తెలుగుదేశం పార్టీది ఇదే బాటలో., కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన బిజెపి ఎస్సీల వర్గీకరణ బూటకం., మళ్ళీ అధికారంలోకి రావాలని వారి మద్య చిచ్చు పెడుతున్నారు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తాం
కాంగ్రెస్ మొదటి నుంచి స్కాములు చేస్తుందని… బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అవసరమైన స్కీములను ఏర్పాటు చేస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్లకు నోటు కేసులో దొరికిన ఒక దొంగ… ఇక్కడున్న ఓ దొంగను గెలిపించమనడం ప్రజలు విస్తూ పోతున్నారని అన్నారు. ఇద్దరి దొంగలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. టూరిస్ట్ లాగా వచ్చి ప్రజలను మభ్యపెడితే ఊరుకునేది లేదన్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలుస్తుందన్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీల మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చివరి లిస్ట్‌లో నీలం మధు ముదిరాజ్‌కు బదులు కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయిస్తు ప్రకటన విడుదల చేసింది. దీంతో నీలం మధు ముదిరాజ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే రాత్రి తన అనుచరులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ మా జాతి ఆత్మగౌరవమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పుడు నా అభ్యర్థిత్వాన్ని మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నన్ను, నా జాతిని నమ్మించి గొంతు కోశారు. మా జాతి ఆత్మ గౌరవాన్ని చులకన చేశారు. మాకు జరిగిన మోసానికి తగిన ప్రతిఫలం తప్పదు. ఎవరెన్ని అవమానాలు చేసిన బరి తెగించి కొట్లాడతా.. బరా బర్ పటాన్ చెరు ఎమ్మెల్యే బరిలో ఉంటాను. నన్ను నమ్ముకున్న ప్రజల, కార్యకర్తల కుటుంబ పెద్దగా అండగా నిలబడతాను. కడుపులో పెట్టి చూసుకుంటా.. నా అనుచరులతో కలిసి నామినేషన్ వేస్తాను.. నాకు జరిగిన మోసాన్ని వివరిస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని నీలం మధు ముదిరాజ్ తేల్చి చెప్పారు.






Total views : 152445