ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు కుటుంబ పరమైన అనుబంధంమన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (60) ను సాధించిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మాణిక్ రావ్ ఠాక్రేలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Congress party
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మ్యాజిక్ మార్క్ 60 సీట్లు కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 61 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఫలితాల ట్రెండ్ తో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. ఆయన నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు సెక్యూరిటీ పెంచారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్లా రేవంత్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద శనివారం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అనుచరులు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు భద్రత మరింత పెంచారు.
Read Also..
Read Also..
ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. మరోవైపు ఏ పార్టీ గెలవబోతోందనే విషయంలపై పలు ఎగ్జిట్ పోల్స్ వాటి అంచనాలను వెల్లడించాయి. మరోవైపు గత తెలంగాణ ఎన్నికల సమయంలో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2018లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే అప్పట్లో వెల్లడించింది.
బీఆర్ఎస్ కు 62 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 88 స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని, తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తగా నిబద్ధతతో పని చేస్తున్నానని చెప్పారు. అవసరమైతే ఏపీలో కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని అన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా మీ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని, రైతులు, విద్యార్థులు ఉన్నారని, వారు ఏం కోరుకుంటున్నారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.
గడిచిన నలభై ఏళ్లుగా గుర్తురాని అమ్మగారి ఊరు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇన్నేళ్లలో గల్ఫ్ కార్మికుల గోసను ఏనాడూ ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్ కు తీరికే దొరకలేదని అన్నారు. ఇప్పుడు ఆయన కామారెడ్డికి వచ్చింది ప్రజల కోసం కాదని, ఇక్కడున్న భూములను కాజేసేందుకే వచ్చాడని ఆరోపించారు.
పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also..
Read Also..
శేరిలింగంపల్లి టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలపడ్డరు. పరిస్థితుల ప్రభవలతో జగదీశ్వర్ గౌడ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. రఘునాథ్ యాదవ్, జైపాల్ ఇద్దరు అభ్యర్థులు పార్టీ మారకుండా మంచి మనసుతో జగదీశ్వర్ గౌడ్ కి మద్దతు ఇస్తూ ప్రచారం లో పాల్గొనడం సంతోషం కలిగిస్తుంది. శేరిలింగంపల్లి ఎమ్మేల్యే గాంధీ ఇక్కడ చేసింది ఏమీ లేదు. పేరులో గాంధీ ఉన్న చేసే పనులన్నీ దొంగ పనులు గాంధీ ఓ ద్రోహి రేపు జరగబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి నే అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి. ఈ పదేళ్లు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా..నిరుద్యోగ యువతకు ఈ ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు. ఆయన మనవడిని మంత్రిని చేస్తే లక్కీ నంబర్ 6 ఇంట్లో మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు వచ్చినట్టే అనే ఆశతో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. కేసీఆర్ కు నేను ఓ హామీ ఇస్తున్న తప్పకుండా కేసీఆర్ కు డబుల్ బెడ్ రూమ్ ఇస్తం. కేసీఆర్ బక్కొడు కాడు భూ బకాసురుడు. అది ఎక్కడో కాదు చర్లపల్లి జైల్ లో ఇస్తాం. కేసీఆర్ చేసిన అవినీతి అంత ఇంత కాదు. బిఆర్ఎస్ ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి నే గెలిపించాలి. మంచి నీ బ్రతికించలి అంటే మంచి అభ్యర్థిని గెలిపించాలి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాబోతుంది.
మరో రెండు రోజులు ప్రచార సమయం ముగిస్తున్న సందర్భంలో అభ్యర్థులు పోట పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డీ ప్రచారం జోరుగ కొనసాగుతుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా132 డివిజన్ జీడిమెట్ల విలేజ్,మీనాక్షిఎస్టేట్, అంగడిపేట, పలు కాలనీలలో రోడ్డు షో ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోలన్ హన్మంత్ రెడ్డీ మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దీమవ్యక్తం చేశారు ఇందిరమ్మ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ పాలన వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు చేర్చే విధంగా కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు. గడిచిన పది సంవత్సరాలనుండి BRS పార్టీ చేసింది ఏమిలేదన్నారు. జరగబోయే ఎన్నికలలో BRS పార్టీ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కోలన్ హన్మంత్ రెడ్డీ అన్నారు.
తెలంగాణ లోని స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితి గురించి రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల ఇబ్బందులు తెలుసన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు మీకు జరిగిన అవమానాలుగుర్తించానన్నారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయన్నారు. ఈ ఎన్నికలతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. జెండాలకు, అజెండాలకు అతీతంగా మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామరక్ష అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదన్నారు. రాహుల్‌గాంధీ 2014 నుంచి ఆయన రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారని విమర్శించారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. గోషామహల్లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఏడాది నవంబర్ 29న దీక్షా దివస్ గా ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆరోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.






Total views : 151624