కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఏర్పాటు చేసిన పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్ సుదీర్ఘంగా జరిగింది. గాంధీభవన్‌లో 3 గంటలు పాటు కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు పీఏసీ సభ్యులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఏఐసీసీ ఇన్చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ప్రధానంగా మూడు తీర్మానాలు చేయగా, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాలు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
Congress party
నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన చెందారు. తెలంగాణలో సమిష్టి కృషితోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. కేవలం సీపీఐ వల్లే గెలిచిందని తాను ఎక్కడా చెప్పలేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో సీపీఐతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని మిగతా రాష్ట్రాల్లోనూ తమతో పొత్తు పెట్టుకున్న వారే గెలుస్తారని గత అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని తెలంగాణలో 90 నియోజకవర్గాల్లో తమ పార్టీ ప్రభావం ఉందని అందుకే కాంగ్రెస్ ఈజీగా గట్టెక్కిందని సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీంతో నారాయణ స్పందించి ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటగా చిట్యాలకు వచ్చిన సినిమాటోగ్రఫీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి గజమాలతో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. చిట్యాల సెంటర్ లో మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసిన మంత్రి వెంకట్ రెడ్డి.
మంత్రి వెంకట్ రెడ్డి కామెంట్స్:
- కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో నకిరేకల్ లో గెలిపించి వేరేశం ను ఎమ్మెల్యే గా చేసినందుకు మీకు ధన్యవాదాలు.
- చిట్యాలలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణంకి జనవరి 2న టెండర్ స్టార్ట్ చేసి సంక్రాంతికి శంకుస్థాపన చేద్దాం.
- చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని హామీ.
- చిట్యాల మున్సిపాలిటీ కి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తా.
- గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ లే ఉన్నాయి. అప్పుడు ఎలాగైతే రెట్టింపు వేగంతో పనిచేసామ్మో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో పని చేసి నకిరేకల్ నియోజకవర్గంని అభివృద్ధి చేసుకుందాం.
మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన ఆర్కే స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. మంగళగిరి వైసిపి ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఆర్కే మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి, వైసిపికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని తెలిపారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేశానని దీన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తానని ఆర్కే తెలిపారు. అయితే, అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం తెలంగాణ సచివాలయంలోని 5వ అంతస్తు తన చాంబర్లో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ముఖ్య ఫైల్స్‌పై సంతకాలు చేయనున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగిరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా కొంతమంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటి రెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా పని చేసిన ఆయన తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షలు పందెం కాశానని, కానీ తన కుమారుడు ప్రణీత్ రెడ్డి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో ఆ పందెం రద్దు చేసుకున్నానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు తెలిసి కూడా, కుమారుడు చెప్పడంతో పందెం విరమించుకున్నానని తెలిపారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు మద్దతు ఇస్తే కచ్చితంగా ఒంగోలు నుంచి బరిలో దిగుతానని, మద్దతు ఇవ్వనంటే అసలు పోటీయే చేయనని అన్నారు. తాను నీతిమంతుడ్ని అని, ఎక్కడా డబ్బులు తీసుకోలేదు అని చెప్పననీ. అయితే ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా తప్పు చేయలేదని, మంత్రిగా ఉన్నప్పుడు బయటి వాళ్లు ఇస్తే తీసుకున్నాను అనీ అన్నారు. డబ్బులు తీసుకోకుండా తాను రాజకీయాలు చేయలేనని అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ విజయోత్సవ ర్యాలీలో ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కొల్లాపూర్ కు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అడుగడుగునా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథం పై మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.కొల్లాపూర్ పట్టణంలో దారి పొడవున ప్రజలు మంత్రి జూపల్లి కృష్ణారావు పై పూల వర్షం కురిపించారు.పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు కొల్లాపూర్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్ని జన్మలెత్తినా కొల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లాపూర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడించారు.కొల్లాపూర్ ను అన్ని రంగాలలో తన శక్తి వంచన లేకుండా తన చేతనైనంత పని చేస్తానాని నా వంతు కృషి చేస్తానాని హామీనిచ్చారు.నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కొల్లాపూర్ ప్రజలకు సేవ చేస్తానాని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని నారాయణ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపు అధికమంది మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుపుతోంది. దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? అనే అంశంపై ఓ డిజిటల్ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆరు లక్షలమంది పాల్గొన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి పేరును సూచించారు. డిజిటల్ మార్గంలో జరిగిన ఈ సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి, 16 శాతం మంది మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓటు వేశారు. ఐదు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడు శాతం మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వైపు మొగ్గు చూపారు.





Total views : 150955