ఘనంగా మాజీ శాసనసభ్యులు మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమం కందుకూరు విధానసభ మాజీ సభ్యులు దివంగత మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమం, బుధవారం ఆయన స్వగ్రామం మాచవరంలో వేలాదిమంది అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన తనయులు ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి , వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి విగ్రహానికి నిలువెత్తు గజ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదినారాయణ రెడ్డి, ప్రజా బంధుగా, నిగరివిగా కందుకూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు .ఈ కార్యక్రమానికి తరలివచ్చిన వేలాదిమంది మానుగుంట అభిమానులు స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
cvr news channel
నిర్మల్ జిల్లా అమానుష ఘటన చోటుచేసుకుంది. బైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన. నాలుగు వానరాలను చంపి కాల్చి వండుకొని తింటున్న నలుగురిని పట్టుకున్న గ్రామస్తులు, వారి వద్ద లభించిన కాల్చిన వానరం తల,కళ్ళు,చేతులు. వారిని పట్టుకొని నిలదీయడంతో నిజం ఒప్పుకున్న వ్యక్తులు. తాము పూజించే వనారాన్ని ఎందుకు చంపారు అని పట్టుకున్న గ్రామస్తులు.
జగ్గయ్యపేట మండలం, తక్కెళ్ళపాడు గ్రామంలో జరుగుతున్న పల్లెనిద్ర కార్యక్రమం. సచివాలయం లో ఉన్న సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు ను పోలిస్ లు బయటకు ఎందుకు తీసుకొచ్చారని, క్షమాపణ చెప్పాలని రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేసిన గ్రామ ప్రజలు,టీడిపి సానుభూతిపరులు గ్రామస్తులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులకు తెలియజేశామని సర్దిచెప్పిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్. గ్రామస్తులతో సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడి ఆందోళనను విరమింప చేశారు.
పార్వతిపురం మన్యం జిల్లా. నర్సిపురం గ్రామంలో అగ్నిప్రమాదం. పెద్ద వీధిలో మాచర్ల శ్రీరాములు గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. ఇంటి నుంచి భారీ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి.. సమాచారం అందించిన గ్రామస్తులు. సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అమలాపురం రూరల్ మండలం సమనస బి సి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వలన అస్వస్థత గురైన విద్యార్థులు. మధ్యహన భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి తో బాధపడితున్న విద్యార్థులు. పి హెచ్ సి లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అమలాపురం ఏరియా ఆసుపత్రి కి తరలింపు. ఆందోళన లో విద్యార్థుల తల్లిదండ్రులు…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరంనియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం. కార్తీకమాసం ఆఖరి రోజు కావడంతో మహిళలు భక్తిశ్రద్దలతో పోలిస్వర్గం కి సాగనంపుతారు. నెలమొత్తం ఎంతగానో ఉపవాసం, నోములు, వ్రతాలు చేసి తమ పసుపు కుంకుమ లు చల్లగా ఉండాలని పరమశివుని ప్రార్థిస్తూ నదిలో పుణ్య స్నానం చేసి దీపాలు వెలిగించి నదిలో వదిలి పూజలు ముగించుకుంటారు. విజయవాడ వన్ టౌన్ కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కృష్ణా నదిలో స్థానమాచరిస్తున్న భక్తులతో కిటకిటలాడుతున్న కృష్ణమ్మ.
హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను, దుకాణదారులను ఆత్మీయంగా పలకరించారు. తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అయినా పొన్నం ప్రభాకర్ సాదాసీదాగా వ్యవహరించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా, సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి హెచ్చరించారు. మంగళవారం గజపతినగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన చేపట్టారు.
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటీ, గంటా మురళి తదితరులు విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను టిడిపి బృందం పరిశీలించింది. సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రైతులను పరామర్శించడానికి పంట నష్టం అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారికి కూడా రాలేదని మండిపడ్డారు. పంట కాలువలో పూడిక తీయక పోవడం వల్ల కురిసిన వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట నష్టం తీవ్రంగా ఉందని అన్నారు.. పండిన పంట చేతికి వచ్చే సమయం లో వచ్చిన ఈ కష్టాన్ని ప్రభుత్వ భరించాలని రంగు మారిన మొలకెత్తిన ధాన్యం బేషరతుగా ప్రభుత్వం కొనాలి, అలా కొనని పక్షంలో మార్చి తర్వాత ఏర్పడే టిడిపి జనసేన ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు. అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కేవలం ఏసీ రూములకే మాత్రమే పరిమితం అయ్యారని విమర్శించారు.. వైయస్సార్సీపి పార్టీకి టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం పై ఉన్న శ్రద్ధ రైతుల పంట పొలాలు పరిశీలించడంలో లేదని మండిపడ్డారు.. రైతులకు ఎల్లప్పుడూ టీడీపీ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు.





Total views : 140818