తెలంగాణ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గారి బాధ్యతలు చేపట్టిన తరువాత మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చిన డిప్యూటి సియం భట్టి విక్రమార్క. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటి సియం భట్టి విక్రమార్క. రోండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి. డిసెంబర్ 28వ తేదిన కాంగ్రేస్ పార్టి ఆవిర్బవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తాం. రైతు భరోసా అమలు చెయ్యడానికి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తాం.
cvr news channel
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన..ఆందోళన చేపట్టనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు.. అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడి కార్యకర్తలు.ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రం తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు 26 వేల జీతము , ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేనిపక్షంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెలో పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డనియోజకవర్గం. అవనిగడ్డ కేంద్రం గా నిరుద్యోగులు, తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన. డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని రాస్తారోకో(ఉపాధ్యాయులు ఉద్యోగాలు) భారీ గా నిరుద్యోగులు రోడ్డుపై వచ్చి,డిఎస్పీ పోస్ట్ భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయాలి. నిరుద్యోగులకు పూర్తిగా మద్దతు పలికిన, ప్రతిపక్ష పార్టీ,టిడిపి జనసేన. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ధర్నా లు ,రాస్తారోకో అనుమతులు లేవుంటూ ఆంక్షలు విధించిన పోలీసులు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టిన నిరుద్యోగులు. ధర్నా వద్దకు భారీ గా పోలీసు యంత్రాంగం
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తురు నుండి రేపల్లె కు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఆటో బోల్తా పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగలడంతో రోడ్డుపై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు. ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు. భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే మద్దాలి గిరిని మార్చడంపై మాట్లాడంపై సమావేశం అవుతున్న ఆర్యవైశ్యులు. సమావేశంపై ఉత్కంఠ. మద్దాలగిరికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించకపోతే రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆర్యవైశ్యులు..
పార్వతీపురం మన్యం జిల్లా, ఎర్రా కృష్ణమూర్తి కాలనీ, సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం. మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ. వై.కె.యం కాలనీలో గల శoబాన రాణి అనే మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. దాదాపు 13 తులాల బంగారం, 70 వేల నగదు వెండి వస్తువులను అపహరించిన దుండగులు. 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు. తరచూ ఇలాంటి సంఘటన జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల ఆగ్రహం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం. హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు. ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. రోడ్ దిగి పత్తి చెనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. వరంగల్ 2 డిపో కు చెందిన బస్సు గా గుర్తింపు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని బాధితుడు కోరారు..
ఏలూరు జిల్లా, దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నరు. ఉదయం 9.35 గంటలకు విజయవాడ రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10.50 గంటలకు గాలాయిగూడెం చేరుకోనున్న గవర్నర్. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.40 వరకు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొననున్న గవర్నర్. మధ్యాహ్నం 12.45 గంటలకు గాలాయిగూడెం నుండి రోడ్డు మార్గంలో విజయవాడ రాజ్ భవన్ కు వెళ్లనున్న గవర్నర్.
అమరావతి, భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ. 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, విజయవాడ. తుఫాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కు కిసాన్ మోర్చా పిలుపు. వరిచేల వద్దకు వచ్చి నష్టం అంచనాలు వేయాలి. రైతు వద్ద కు ప్రతి వడ్ల గింజ కొనాలని కోరుతూ 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ధర్నాలకు దిగనున్నామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి వెల్లడించారు. కౌలు రైతుల ను ఆదుకోవడం తో పాటు రెండు రోజుల్లో రైతు లు వద్ద తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కుమార స్వామి డిమాండ్ చేశారు. పంట నష్టం ప్రాధమిక నివేదిక కేంద్రానికి అందచేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. వేలకోట్ల రూపాయలు పంటనష్టం జరిగితే అంచనాలు రూపొందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దిశలో ఉంది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. తడిచిన ధాన్యం అయినకాడికి అమ్ముకొంటున్న రైతులు – చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించాలి. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఉదారంగా చెల్లించాలి. పత్తి, మిరప, పొగాకు, అరటి, పసుపు పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలి. ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల సాయం అందించాలి. డ్రైనేజ్ , ఇరిగేషన్ కాలువలను వెంటనే ఆధునీకరించాలి. పంట కోల్పోయిన రైతుల పంటరుణాలను మాఫీ చేయాలి. ఎరువులు, విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి. ప్రతి రైతుకు పంటల బీమా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు, కిసాన్ మోర్చా ఆందోళన కు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు.





Total views : 140862