cvr news channel
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు సమాచారం తో ఎస్ ఇ బి అధికారులు దాడి. పుదుచ్చేరి యానాం నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని,269 ఎన్.డి.పి.ఎల్. మద్యం సీసాలు,51బీర్లు స్వాదీనం చేసుకున్న అధికారులు..
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు, అంగరంగ వైభవంగా కార్తీక మాస వేడుకలు. దీపావళి అనంతరం దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది అనే విషయం అందరికీ తెలిసినదే ఇందులో భాగంగానే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందువులు ప్రతిరోజు శివుని ఆలయానికి వెళ్లి దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలలో దీపాలతో దీపారాధన చేస్తారు. కొంతమంది 365 దీపాలతో మరి కొంతమంది లక్ష దీపాలతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. ఈ కార్తీకమాసంలోనే హిందువులు వనభోజనాలకు వెళ్లి సరదాగా సంబరాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే రైల్వేకోడూరు పట్టణంలో నడిబొడ్డున వెలసి ఉన్న భుజంగేశ్వర స్వామి ఆలయంలో రైల్వే కోడూరు ఉపసర్పంచ్ తోట శివ సాయి సహకారంతో భుజంగేశ్వర ఆలయ చైర్మన్ పోకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కార్తీకమాసం మొదటి రోజు నుండి నేటి వరకు అనగా నెల రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులతో లక్షలాది దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేసి ప్రజలు తమ భక్తుని చాటుకున్నారు. ప్రత్యేకించి సోమవారాలలో అంగరంగ వైభవంగా పూజలు, అన్నదానాలు, భజన కార్యక్రమాలు, దీపారాధనలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భుజంకేశ్వర ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరించారు. నాలుగవ కార్తిక సోమవారం నాడు మిచౌంగ్ తుఫాన్ సైతం లెక్కచేయకుండా జోరు వానలో హోరుగా అన్నదానాలు, భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తులు పోటెత్తిపోయారు. కార్తీక మాసం పూలు పండ్లు, కాయ కర్పూరం లాంటి చిరు దుకాణాల వ్యాపారులకు కనక వర్షం కురిపించింది. ఏది ఏమైనప్పటికీ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో భుజంగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తిపోయారు. చివరి వారం కావడంతో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి భుజంగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది రైల్వే కోడూరు ప్రజలు, వర్తకులు, రైతులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థించాలని కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి తెలియజేశారు.
టీ.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో అశోక్ నగర్ లో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ రియాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. టీ.ఎస్.పి.ఎస్.సి పేపర్ లీకేజ్ కారణంగా ఎంతో మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఆయన రాజీనామాతో టీ.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాళన అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బిఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగులు కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని. నిరుద్యోగుల పోరాటానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీశైలంలో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు కార్తికమాస చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఈ లక్షదీపోత్సవంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు భక్తులు,ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు రేపటి అమావాస్యతో శ్రీశైలంలో కార్తీక మసోత్సవాలు ముగుస్తాయి.
ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్ లేదా నెట్వర్క్ యొక్క లోపాలను గుర్తించడానికి, వాటిని దుర్వినియోగం చేసే ముందు వాటిని పరిష్కరించడానికి వ్యూహాత్మకంగా దాడి చేసే ఒక సైబర్ భద్రతా పద్ధతి. దీనిని penetration testing లేదా white-hat hacking అని కూడా అంటారు. ఎథికల్ హ్యాకర్లు కంప్యూటర్ సిస్టమ్‌ల భద్రతను మెరుగుపరచడంలో సహాయపడే నైతిక న్యాయవాదులుగా పరిగణించబడతారు.
ఎథికల్ హ్యాకింగ్ ఎందుకు ముఖ్యమైనది?
డిజిటల్ యుగంలో, మన వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం ఎక్కువ భాగం కంప్యూటర్ సిస్టమ్‌లలో నిల్వ చేయబడుతుంది. ఈ సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఎథికల్ హ్యాకర్లు కంప్యూటర్ సిస్టమ్‌లలోని లోపాలను గుర్తించడంలో సహాయపడతారు, తద్వారా హ్యాకర్లు వాటిని దుర్వినియోగం చేయకుండా నిరోధించవచ్చు.
ఎథికల్ హ్యాకర్లు ఎలా పని చేస్తారు?
ఎథికల్ హ్యాకర్లు కంప్యూటర్ సిస్టమ్‌లను దాడి చేసే ముందు కంపెనీల నుండి అనుమతి పొందుతారు. వారు సిస్టమ్‌లోకి ప్రవేశించడానికి మరియు లోపాలను గుర్తించడానికి అదే పద్ధతులను ఉపయోగిస్తారు. లోపాలను కనుగొన్న తర్వాత, ఎథికల్ హ్యాకర్లు కంపెనీకి నివేదికను అందిస్తారు, ఇందులో లోపాలు ఎలా పరిష్కరించబడతాయో వివరించే సిఫార్సులు ఉంటాయి.
ఎథికల్ హ్యాకింగ్ యొక్క ప్రయోజనాలు:
- కంప్యూటర్ సిస్టమ్‌ల భద్రతను మెరుగుపరుస్తుంది.
- వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని రక్షిస్తుంది.
- సైబర్ నేరాలను నివారించడంలో సహాయపడుతుంది.
ఎథికల్ హ్యాకింగ్ యొక్క ప్రమాదాలు:
- ఎథికల్ హ్యాకర్లు అనుకోకుండా సిస్టమ్‌ను దెబ్బతీయవచ్చు.
- లోపాల గురించి సమాచారం తప్పుడు చేతుల్లో పడవచ్చు.
- ఎథికల్ హ్యాకర్లు కూడా హానికరమైన హ్యాకర్లుగా మారవచ్చు.
ఎథికల్ హ్యాకర్ ఎలా అవ్వాలి?
ఎథికల్ హ్యాకర్‌గా మారడానికి, కంప్యూటర్ సైన్స్, సైబర్ భద్రత మరియు నెట్వర్కింగ్లో బలమైన నేపథ్యం ఉండాలి. అనేక కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఎథికల్ హ్యాకింగ్‌లో డిగ్రీలు మరియు సర్టిఫికేట్లను అందిస్తాయి.
పండ్లు అనేవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలాలు. పండ్లను తినడం వల్ల మన శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉంటాము.
సీజనల్ పండ్ల రసాలను తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీజనల్ పండ్లు అంటే ఆ ప్రాంతంలో ఆ సమయంలో లభించే పండ్లు. సీజనల్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
సీజనల్ పండ్ల రసాలను తాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:
- శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. సీజనల్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని రసాలుగా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా పొందవచ్చు.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ పండ్లలో ఉండే విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
- శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. పండ్ల రసాలు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తాయి. వేసవిలో శరీరంలో నీరు హరించకుండా ఉండటానికి సీజనల్ పండ్ల రసాలు చాలా మంచివి.
- దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సీజనల్ పండ్ల రసాలు ఫ్లూరైడ్ను కలిగి ఉంటాయి. ఫ్లూరైడ్ దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సీజనల్ పండ్ల రసాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
సీజనల్ పండ్ల రసాలను తాగడానికి కొన్ని చిట్కాలు:
- రసాలు తయారు చేసేటప్పుడు పండ్లను మెత్తగా చేసి తాగడం మంచిది.
- రసాలలో చక్కెర లేదా ఇతర రుచులను జోడించకుండా ఉండటం మంచిది.
- రసాలను నిల్వ చేయకుండా తాగడం మంచిది.
సీజనల్ పండ్ల రసాలు చాలా ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, సీజనల్ పండ్ల రసాలను తీసుకోవడం మంచి ఆలోచన.
పుంగనూరు మేలుపట్ల కు చెందిన లతీఫ్ (28) కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రతిరోజూ కూలి పనులుకు వెళ్లేవారు. రోజు మాదిరిగా ఉదయం స్థానికంగా రాయల్ పేట రోడ్డు లో రేకులు షెడ్ వేయుటకు వెళ్లినట్లు లతీఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రేకుల షెడ్ పనులు చేస్తున్న సమయంలో షెడ్ పై పోతున్న 11 కెవి విద్యుత్ వైర్లు ప్రమాద వశాత్తు తగిలి కాలినట్లు స్థానికులు సమాచారం. హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేసి అతన్ని పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రధమ చికిత్స వైద్యులు అందించారు. మెరుగైన వైద్యం కొరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకురావడం దారుణమని న్యాయవాది వంగర వెంకటాచార్యులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ భూహక్కు చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల సంఘము ఆధ్వర్యంలో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. అనంతరం ఆర్ డీవో అచ్యుత్ అంబరీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భూ హక్కు చట్టం కబ్జాదారులకు వరంగా మారనున్నదన్నారు. ఇది ఒక చీకటి చట్టం అన్నారు. రెవెన్యూశాఖ పాదాల చెంతకు ప్రజల ఆస్తి హక్కులును ప్రభుత్వం పెట్టిందన్నారు. మన హక్కులు కూడా డబ్బు పెట్టి కొనుక్కొనే చట్టం అన్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ లో రెడ్ టేపిజం, లంచగొండితనం పెరిగి పోయిందన్నారు. అధికారులు ఉత్తర్వులు ఇస్తే జిల్లా, రాష్ట్ర ట్రిబ్యునల్ దానికే మద్దతు ఇస్తుందన్నారు. అధికారులు ఇచ్చిన తీర్పును హైకోర్టులో పెట్టాలి. ఇప్పటికే హైకోర్టులో పని భారం పెరిగి పోయిందన్నారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలు అందరూ వ్యతిరేకించాలని కోరారు.
విజయవాడ.. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్ నేతలు పొంగులేటి ను రిసీవ్ చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో తెలంగాణ మంత్రికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో పొంగులేటి శ్రీనివాస్ రావు కు సుంకర పద్మశ్రీ వీడ్కోలు పలికారు.





Total views : 141322