అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారు టెక్సాస్ విశ్వవిద్యాలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను అరవింద్ మణి, అతని భార్య ప్రదీపా అరవింద్, వారి కుమారుడు ఆండ్రిల్ అరవింద్‌గా గుర్తించారు. ఈ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలడమే ఈ ప్రమాదానికి కారణం. దాంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆ ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో కొడుకును వదిలిపెట్టేందుకు కారులో వెళ్లడం, ప్రమాదం జరగడంతో ఇలా ముగ్గురు మృతి చెందారు. కాగా, అరవింద్ మణి, ప్రదీపా దంపతులకు మరో కుమారుడు ఆదిర్యాన్ ఉన్నాడు. కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో అతడు ఒంటరిగా మిగిలిపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు చనిపోవడం పట్ల అక్కడి ప్రవాస భారతీయులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్లాండ్లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
- విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో ఉన్న ‘డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను, ప్రారంభించిన మంత్రి..చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ విజన్‌కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో డ్రగ్స్ కంట్రోల్…
- ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్‌ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 150639