కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
Film News
భారతమాల, రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి చేయాలని లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు -RRR భూసేకరణ కోసం NHAI కి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి …సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. RRR భూసేకరణ కోసం నాయ్ కు 50 శాతం నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెంచేశారు. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
పీపుల్స్ మీడియా అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ‘మంచి కంటెంట్‌తో రామ్ చిత్రం రాబోతోంది. ఎన్నో ఆర్థిక కష్టాలను పడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను కొంత రషెస్ చూశాను. సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమానే అయినా సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. కంటెంట్ ఉంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు. మన సైనికులు, ప్రాణ త్యాగాల మీద చిత్రాలు వస్తుంటాయి. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రం తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్. వారి త్యాగాలను చూపించి అందరికీ మరోసారి వారి గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఎంతో నిజాయితీగా ఈ సినిమాను తీశారు. సాయి కుమార్, ధన్యా బాలకృష్ణ పాత్రలు బాగున్నాయి. మొదటి చిత్రం కావడంతో సూర్య తనకు తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డారు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించారు. దేశ భక్తిని చాటే చిత్రంగా జనవరి 26న రాబోతోంది. ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ.. ‘మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. మా అమ్మానాన్నలు ఎవరో ప్రేక్షకులకు తెలియదు. ఒక హిట్ ఇస్తే ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుంది. అందుకే ఈ సినిమాను తీశాం. ఈ చిత్రానికి నలుగురు పిల్లర్స్‌గా నిలిచారు. నేను, డైరెక్టర్, కెమెరామెన్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్. నా స్నేహితులందరూ కలిసి ఫండింగ్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది ఉండదు. మొన్నే పెద్ద చిత్రాల మధ్యలో చిన్న సినిమా వచ్చి నిలబడింది. ఇప్పుడు కూడా పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రం రాబోతోంది. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. ఇక మున్ముందు రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. వందలో అరవై మందికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మిహిరామ్ గారికి థాంక్స్. భానుచందర్, సాయి కుమార్ గారికి థాంక్స్. ప్రతీ డైలాగ్ తూటాలా ఉంటుంది. క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. సినిమా బాగుంటే.. బాగుందని లేకపోతే బాగా లేదని చెప్పండి’ అని అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తరువాత దేశ భక్తిని చాటే చిత్రంలో నటించాను. మొదటి సినిమాతోనే ఇలాంటి జానర్‌ను ఎంచుకుని సూర్య చాలా కష్టపడ్డాడు. హీరో సూర్య, దర్శకుడు మిహిరామ్ ఇద్దరూ కృష్ణార్జునలుగా కలిసి ఎంతో కష్టపడి సినిమాను తీశారు. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. ఫైట్స్ అన్నీ బాగుంటాయి. డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమాను మా వంతుగా చేశాం. ఇక నిర్ణయం ప్రజలదే. కంటెంట్ బాగుంటే.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే సినిమాను ఆపలేరు. ఇప్పుడు అంతటా హనుమాన్ ఆడుతోంది. ఇప్పుడు ఈ రామ్ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
దర్శకుడు మిహిరాం మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సపోర్ట్‌గా నిలిచిన వివేక్ కూచిభొట్ల గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత దీపికాంజలికి థాంక్స్. సినిమాలో నటించిన, పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ధారన్ సుక్రి మంచి కెమెరామెన్‌గా ఇండస్ట్రీలో ఎదుగుతారు. రాజ్ కుమార్ మాస్టర్ ఫైట్స్ బాగుంటాయి. దేశ భక్తిని చాటే చెప్పే చిత్రమే కానీ.. బార్డర్లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు. ఓ సైనికుడు చనిపోతే దక్కే గౌరవం వాళ్లకి దక్కదు. అలాంటి అన్ సంగ్ హీరోల గురించి చూపించాను. మాకు ఇప్పుడు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. కానీ మంచి థియేటర్లను తెచ్చుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ గణేష్ ప్రయత్నిస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరించాలి. మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ.. ‘మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్లో రూ. 5లు డిఫెన్స్‌కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని అన్నారు.
ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. వారి రాకతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. సాయి కుమార్ గారితో నటించడంతో లైఫ్ సర్కిల్ కంప్లీట్ అయినట్టుగా అనిపించింది. సూర్య, దీపికలు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు. దర్శకుడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. మా చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కథతో పాటు మెసెజ్ ఇస్తూ తెరకెక్కిన చిత్రం ‘బీఫోర్ మ్యారేజ్’. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ బిఫోర్ మ్యారేజ్.
భరత్ – నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు… రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు… ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది ‘హనుమాన్’ చిత్రం కొనసాగించిన ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాటలు బాగున్నాయి. మంచి విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు విష్ చేస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. మ్యూజికల్ హిట్‌గానూ నిలుస్తుందని చెప్పవచ్చు. లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉంది.. హీరోయిన్ బాగా చేసింది. ఇలాంటి సినిమాలను ఆదరించాలి. చిత్రయూనిట్‌కు బెస్టాఫ్ లక్.
దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ.. పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటు.. లైఫ్‌లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విషయాన్ని వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించాము. టీమ్‌లో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ విషయంలో నిర్మాత సహకరించారు. సినిమా హిట్టవుతుందన్న నమ్మకం ఉంది.
నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించాము. సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్టవుతుంది. యువతీయువకులకు మంచి మెసెజ్ ఇందులో ఉంటుంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాము.
హీరో భరత్ మాట్లాడుతూ… మంచి కథ ఇది. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. ఈ తరం యువతకు బాగా ఎక్కే సినిమా ఇది. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
హీరోయిన్ నవీన రెడ్డి మాట్లాడుతూ… నేను తెలుగుమ్మాయిని. ఒక సాధారణ అమ్మాయి లైఫ్‌లో జరిగే పరిస్థితులే ఈ సినిమా. టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాము. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
నటి అపూర్వ మాట్లాడుతూ… మంచి యూత్ ఫుల్ మూవీ. మళ్లీ మళ్లీ చూసేలా సినిమా ఉంది. యువత కచ్చితంగా సినిమాను చూసి హిట్ చేయాలి.
నటీనటులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ…
గాయనీగాయకులు: మంగ్లీ, సంథిల్య పిసపాటి, అపర్ణ నందన్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికుమార్ గొల్లపల్లి,
మ్యూజిక్: పీఆర్
డీవోపీ: రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల
నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి
ఎడిటింగ్ అలోష్యాస్ క్సవెర్
పబ్లిసిటీ డిజైనర్: జేకే ఫ్రేమ్స్
పీఆర్ఓ: ఆశోక్ దయ్యాల
Read Also..
ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్ర – కర్ణాటక ప్రభుత్వాలతో కలిపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తానని మంత్రి తుమ్మల రైతులకు హామి ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండలం, అల్లిపల్లి గ్రామంలో ఆంధ్ర పామాయిల్ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి నిర్ణయాల వల్ల పామాయిల్ రైతాంగానికి అపార నష్టం వస్తుందని రైతులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న12 వేల చిల్లర ధర.. గిట్టుబాటు కావడం లేదని లేబర్ కాస్ట్ , ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగిపోవడంతో కనీసం 18 వేలకు మద్దతు ధర అయితే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కేంద్రంపై పోరాడితే సరిపోదని తెలంగాణ, కర్ణాటక కూడా సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారని తుమ్మల అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని.. మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలని అమలు చేయకపోతే బట్టలు విప్పి కాంగ్రెస్ నేతలను నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని చూస్తోందని.. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పెద్ద ఓటమేమి కాదని.. 39 సీట్లు రావడం చిన్న విషయం కాదని అభిప్రయపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని.. కేసులకు ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.
ఏ లక్ష్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు అవుతుందని… అప్పటి నుంచి నా రాజీనామా ఆమోదించకుండా.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నా రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని గంటా మండిపడ్డారు. రాజ్యసభలో నా ఓటు హక్కు వినియోగించుకుంటానని, దీనికోసం న్యాయ పోరాటం చేస్తానన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయని మండిపడ్డారు.. నన్ను అడగకుండా రాజీనామాను ఆమోదించారని, కుట్ర కోణంతో వైసీపీ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా అంటూ గంటా ప్రశ్నించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు.
అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు తెలిపారు. మా పార్టీకి, అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉందని… కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరేందుకేనని అనడం ఎంతవరకు సమంజసమని కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. మా నియోజకవర్గంలోని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రిని కలిశామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరో వందసార్లు కలుస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. తాను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలో అని, చనిపోయేంత వరకూ పార్టీలోనే కొనసాగుతానని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తమకు లేవని తేల్చి చెప్పారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. నిన్నటి నష్టాలకు చెక్ పెట్టేశాయి. తొలుత నష్టాలతో మొదలైన సూచీలు ఇంట్రాడేలో బాగా కోలుకున్నాయి. ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానకి బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ – బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71,060 వద్ద ముగిసింది. దీంతో మరోసారి 71 వేల మార్కు అధిగమించినట్లయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ – నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగింది. 215 పాయింట్ల లాభంతో 21,453 వద్ద నిఫ్టీ పరుగు చాలించింది. బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్లు, ఫైనాన్స్ నిఫ్టీ 67 పాయింట్లు పైకి ఎగశాయి. నిఫ్టీలో హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొ, హెచ్.సి.ఎల్ షేర్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ లో ఐ.ఎఫ్.సి.ఐ, బాంబే డయింగ్, హెచ్ఎఫ్సీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, మిశ్రధాతు నిగమ్ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జించాయి.





Total views : 150605