కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా పంచాయతీరాజ్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి మీదుగా ర్యాలీ గా వచ్చి సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం కు చేరుకున్నారు. ర్యాలీలో ప్రస్తుతం కరువుతో రైతులు పడే కష్టాలు ఎద్దుల బండి కాడమోసి రైతు ఆత్మహత్య చేసుకునే దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవమాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.ఈ కరువు తో వలసలు వెళుతు, రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం వారి కష్టాలు కూడా తెలుసుకోలేని దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అంత కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు.
political news
గజ్వెల్ మండలం కొల్గూర్ గ్రామం రైతు బిడ్డ బిగ్ బాస్ లో విజయం సాధించారు. బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ గా ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. గొడుగు సత్యనారాయణ, విజయ దంపతులకు కుమార్తె గౌతమి, కుమారుడు ప్రశాంత్, మనోహర్, వినయ్ సంతానం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించారు. ప్రశాంత్ స్వగ్రామంలో ఆరవ తరగతి వరకు, ఏటిగడ్డ కిష్టాపూర్ లో పదవ తరగతి పూర్తి చేసి గజ్వేల్ లో ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ మధ్యలో ఆపి తండ్రికి వ్యవసాయ పనుల్లో అండగా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా , ఫేస్బుక్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ లో జై జవాన్ జై కిసాన్ అంటూ అన్నదాతల కష్టాలు ప్రపంచానికి తెలియజేయడానికి వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవారు. రైతు బిడ్డగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజేతగా నిలిచిన ప్రశాంత్ కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ, మారుతి బ్రీజా కార్ మరియు జాయ్ అలుకాస్ గిఫ్ట్ ఓచర్ బహుమతులుగా లభించాయి. పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం దక్కుతుంది . గత మూడు సంవత్సరాల క్రితం బిగ్ బాస్ లో ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో సీజన్ 7 లో కామన్ మెన్ కోటాలో ఎంట్రీ దక్కింది. బిగ్ బాస్ 7లో 20 మంది కంటెస్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు.
జగిత్యాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండు చేస్తూ వివిధ జిల్లాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో పిలుపు నివ్వగా ఆధార్ కార్డులు, దరఖాస్తులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు.అక్కడి నుంచి భారీ ర్యాలీగా పాత బస్టాండ్, యావర్ రోడ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. సీపీఐ రాష్ర్ట, జిల్లా నాయకులు హాజరు కాగా వారితో ర్యాలీలో పాల్గొన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నామంటే వచ్చామని, తమకు స్థలాలు ఇవ్వాలని పేదలు కోరారు.
ఈరోజు సుబ్రమణ్య షష్టి సందర్భంగా విసన్నపేట లోవెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 11 గంటలకు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పసుపులేటి సౌజన్య స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించినారు. మరియు షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి, స్వామివారికి పాలకావిడలు, పొంగలి సమర్పించి వేలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ నరసింహారావు, శ్రీనివాసరావు, రామవరపు దుర్గాప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ మహోత్సవంలోగంధం కిషోర్, అత్తునూరి సతీష్ మొత్తం ఎనిమిది మంది దంపతులు మరియు తదితరులు కల్యాణంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయ సిబ్బంది దేవాలయానికి పూలతో ప్రత్యేక అలంకరణ చేసారు. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
విజయవాడ లో యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ రెస్టారంట్ ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. అనసూయ ను చూడడానికి అభిమానులు భారీ స్థాయిలో వచ్చారు. ఈ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ విజయవాడ భోజన ప్రియుల రుచులకు అనుగుణంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలస్ లో అన్ని రకాల వెరైటీ లు లభిస్తాయని, రెస్టారెంట్ విజయవంతం కావాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేసారు.
ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ చౌక్ లో ధర్నా నిర్వహించారు.శానిటేషన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ వేతనాలు పెంచాలి. ప్రతి నెల 5 వ తేదిలోపు వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ స్కూల్స్‌లో పనిచేసే శానిటై జేషన్ వర్కర్లను మున్సిపల్ శాఖలో కొనసాగించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. శానిటేషన్ పరికరాలు (గౌజులు, మాస్క్ లు, శానిటేషన్, చీపుర్లు, ఫినాయిల్ సదుపాయాలు కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రమాద భీమా సౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలన్నింటినీ ఈ కార్మికులకు అమలు చెయ్యాలి. శానిటేషన్ కార్మికులందరినీ 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. బాత్రూంలను ఫోటోతీసి యాప్‌లో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి.
మచిలీపట్నంలో రాజా గారు సెంటర్లో ఏర్పాటు చేసిన బార్గెట్లను వెంటనే తొలగించాలని అనేకమార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ తరఫున గతవారం జిల్లా ఎడిషనల్ ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆ బార్గెట్లను వెంటనే తొలగించాలని వారం రోజులు గడువిస్తూ కలెక్టర్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ గారికి తెలియజేసినప్పటికీ వారు ఎటువంటి యాక్షన్ తీసుకో పోవడంతో మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బండి రామకృష్ణ(RK) గారు జనసేన నాయకులతో కలిసి ఈరోజు స్వయంగా బార్గెట్లను తొలగించి ప్రజలకు ఎప్పుడు జనసేన అండగా ఉంటది అని తెలియజేశార
మాజీ ఎమ్మెల్యే ,ఇంఛార్జి అర్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సు, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ షరీఫ్ హాజరైనారు. కాబోయే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగావాసి సుబ్రమణ్యం, కడప అమీర్ బాబు, ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన ముక్తియార్, మాజీ టిటిడి పాలకవర్గ సభ్యులు సుగావాసి ప్రసాద్ బాబు,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో మైనార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరైనారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ లో రూ.71 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఈ షాపింగ్ కాంప్లెక్స్ వలన వ్యాపారులకు వ్యాపార సముదాయం గా మారుతుంది అన్నారు. చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కూడా అలాగే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ సమిష్టిగా పనిచేసి మార్కెట్ యాడ్ బలోపేతానికి కృషి చేయాలి అని అన్నారు.
గాజాలో అతిభారీ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. సరిహద్దు వద్ద ఎరెజ్ క్రాసింగ్‌కు 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించింది. చిన్న వాహనాలు సునాయసంగా ప్రయాణించేంత పెద్దదిగా ఈ సొరంగం ఉందని వివరించింది. ఈ సొరంగం నిర్మాణానికి కొన్నేళ్లు పట్టి ఉండొచ్చని, భారీగా నిధులు ఖర్చైఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి, హమాస్ చీఫ్ సోదరుడు మహ్మద్ యాహ్యా ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించినట్టు సైన్యం వెల్లడించింది. సొరంగంలోని గోడలు కాంక్ట్రీట్‌తో చేశారని, నేలమాత్రం మట్టితో సిద్ధం చేశారని పేర్కొంది. ఈ సొరంగం తాలూకు వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సొరంగంలో భారీ ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.





Total views : 152311