దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం, మంత్రులు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయంమన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
TPCC Revanth Reddy
రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించారు. ఈ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ధరణి- భూ సమస్యలపై సీఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ పాల్గొన్నారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ చట్టాల నిపుణులను సభ్యులుగా నియమించాలని సూచించారు. పోర్టల్‌కు సంబంధించిన వివరాలపై నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సమీక్ష సందర్భంగా సీఎంతోపాటు మంత్రులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో సమాచారం అందించాలని ఆదేశించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించాలని పోలీసు శాఖను రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో నేటి నుంచి రెండింటిని అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు వచ్చిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తి వేయనున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యమకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు, తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక. తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు….
తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్‌గా సారథ్యం వహించి, నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపికవడం హర్షణీయం. అందుకు సోదరుడు రేంవత్ రెడ్డికి నా శుభాకాంక్షలు. పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు. అవ్వన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యార్థి పార్టీలు విమర్శలు చేశాయి. కానీ, కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం. ఇదే సిద్దాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, అదిష్టానానికి తీర్మాణం పంపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి, పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రధాన్యానికి ఇది సంకేతం. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది. సోదరుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజాఅనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది. సోదరుడు రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా 25వ తేదీన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లు విజయభేరి సభకు హాజరు అవుతున్నారని ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రేస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని అమనగల్ పట్టణం లో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సందీప్, కల్వకుర్తి ఎన్నికల పరిశీలకులు మునీర్, టిపీసీసీ అధికార ప్రతినిధి బలాజిసింగ్, టిపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ లతో 25వ తేదీన జరిగే బహిరంగసభ స్థలిని పరిశీలించి మీడియా సమావేశంలో పాల్గొన్న కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మాట్లాడుతూ అమనగల్ లో జరిగే బారి బహిరంగసభ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కల్వకుర్తి నియోజకవర్గం లోని కల్వకుర్తి, వెల్దండ, అమనగల్, మాడ్గుల తలకొండపల్లి, కడ్తాల్ మండలాలలో అన్ని గ్రామాల ప్రజలు తరలివచ్చి సభను విజవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. కారు దిగి బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు.
రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో కార్పొరేటర్ ల చేరిక బోడుప్పల్ కార్పోరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఒంటెద్దు పోకడ వైఖరి నిరసన గా ఐదుగురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్ అధ్వర్యంలో టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో 23 డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, 1వ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్, 13 వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి, 20 వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్, 24 వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ లు చేరారు.
రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. “సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు. కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట. ” అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు. రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు, బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు. గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు. లక్షలాది పేద ఇంటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. మరి ఏమీ చేయని ఎందుకూ పనికిరాని వాళ్లు, ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వనివాళ్లు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడుతాం, మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో, మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది తప్పా ఉట్టిగా అయ్యే పనికాదని స్పష్టం చేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్ ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలువల మీడియాతో మాట్లాడుతూ…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంభందాలు బలపడాలని,రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని,
కలిసికట్టుగా ప్రపంచంతో పోటిపడాలని స్వామివారిని ప్రార్థించాను అన్నారు. తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను అన్నారు.
పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ కు టికెట్.. టిపీసీసీ నిర్ణయంపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల అసంతృప్తి చెందారు. టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ అభిమానుల నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి పోస్టర్లు బ్యానర్లు కాల్చి ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 9 సంవత్సరాలుగా పార్టీని కార్యకర్తలను కాపాడిన కాటా శ్రీనివాస్ గౌడ్.. 2018 ఎన్నికలలో చివరి తొమ్మిది రోజుల ముందు టికెట్ అధిష్టానం నిర్ణయించిన 80 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కష్టపడ్డ వారికి టికెట్టు కేటాయించకుండా కేవలం రాజకీయ ప్రలోభాలకు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించడం పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓయూ విద్యార్థులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి ఉద్యమ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దరువు ఏళ్లన్న సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో అన్నారు. ఈ మధ్యకాలం లో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులపై చేసిన వాక్యలు వైరల్ అవుతున్నాయని ఆ వాక్యలు ఎప్పుడు చేసిన వైనప్పటికి ఈ మధ్య కాలంలో వైరల్ గా మారాయని వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లో తగిన గుణపాఠం తప్పదని అన్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో సమైక్య వాధ పార్టీలో ఉండి ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి సమైక్య వాద బావాలు ఉన్న వ్యక్తి అని మండి పడ్డారు. తెలంగాణ కు కాపలాగా ఉన్న కాపలా దారులకే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ దే విజయమని 6వ తేదీన వేములవాడ ఎల్లారెడ్డిపేట లలో జరిగే యువ ఆత్మీయ సమావేశాలకు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరవుతున్నారు అని అట్టి సమ్మేళనాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.





Total views : 141063